Peka Medalu Movie Review : తమిళంలో చాలా సినిమాలు చేసిన వినోద్ కిషన్, తెలుగులో నటించిన మొదటి సినిమా ‘పేక మేడలు’. ఈ సినిమా పబ్లిసిటీ కోసం ఎంతో క్రియేటివ్‌గా ప్లాన్స్ చేశారు. ఒకరోజు ముందే ప్రీమియర్స్ కూడా వేశారు. మరి వినోద్ కిషన్, తెలుగు ప్రయత్నం వర్కవుట్ అయ్యిందా?
వినోద్ ఓ బిలో మిడిల్ క్లాస్ భర్త. ఇంజనీరింగ్ చదివినా, ఉద్యోగం చేయకుండా రియల్ ఎస్టేట్‌లో ఫ్లాట్స్ అమ్మి, కోట్లు సంపాదించాలని కలలు కంటూ ఉంటాడు. అతని భార్య వరలక్ష్మీ, కష్టపడి ఇంటిని నెట్టుకొస్తూ ఉంటుంది. భార్య సంపాదించిన డబ్బుతో బతుకుతూ బడాయిలు పోతూ ఉంటాడు. అనుకోకుండా హీరో జీవితంలో మరో యువతి వస్తుంది. ఆమె వల్ల హీరో పడిన ఇబ్బందులు ఏంటి? వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఇదే ‘పేకమేడలు’ మూవీ కథ..
గాల్లో మేడలు కడుతూ, భవిష్యత్తు బాగుంటుందని ఊహించుకుంటూ బతకడమే మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇదే పాయింట్‌తో తెరకెక్కింది ‘పేకమేడలు’ మూవీ.. చాలా సింపుల్‌గా రియాలిటీకి దగ్గరగా కథ రాసుకుని, అంతే చక్కగా దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ మామిళల నీలగిరి.. స్మరణ్ సాయి ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది.. నటీనటులు చక్కగా నటించారు. వినోద్ కిషన్‌కి ఇది మొదటి తెలుగు సినిమా అయినా అద్భుతంగా సెట్ అయ్యాడు. సెకండాఫ్‌లో అక్కడక్కడా కొన్ని సీన్లు లాగ్ అనిపిస్తాయి. అది తప్ప మిడిల్ క్లాస్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ‘పేకమేడలు’..