Pawan Kalyan : పవన్ కి ఏ పదవి ఇచ్చినా సినిమా టికెట్స్ విషయంలో పవన్ ని కలవాలనుందని ప్రభాస్ కల్కి మూవీ టీమ్ చెప్పుకొచ్చింది. పవన్ కి ఏ పదవి ఇచ్చినా సినీ పరిశ్రమ కోసం ఏదైనా చేయాల్సి వస్తే తప్పక చేస్తాడు.
అయితే ఈ సినిమా టికెట్ రేటు విషయానికి వస్తే.. టాప్ హీరోల సినిమాల టికెట్ రేట్లు ఎంత పెంచినా మూవీ లవర్స్ ఎగబడి చూస్తారు. జగన్ ప్రభుత్వంలో చాలాకాలంగా బెన్ ఫిట్ షోలు, స్పెషల్ షోలు మిస్ అయిన ఆంధ్ర అభిమానులకు, మూవీ టీమ్ కి కలిసోచ్చే అంశం.
Women in Assembly : మహిళలు.. ఆకాశంలో సగం, అసెంబ్లీలో మాత్రం..
అయితే ఆ థియేటర్స్ లో కనీస వసతులు ఉండకపోయిన టిక్కెట్టు రేటు పెంచడం సరైన పద్దతి కాదు.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ల విషయంలో అటు నిర్మాత, ఇటు ప్రేక్షకులకు అన్యాయం జరగకుండా చూసుకుంటే చాలు.
రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ పదవి ఇస్తారో తేలనుంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పవన్ అభిమానుల నిరీక్షణకి.. న్యాయం చేస్తారో.. ఉసూరుమనిపిస్తారో వేసి చూడాల్సిందే.