Pawan Kalyan : పదేళ్ల పాటు కనీసం ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా పార్టీని నడిపించుకుంటూ వచ్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పీకే పొజిషన్‌లో ఎవరున్నా ఈ పార్టీకి రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి, పార్టీని ఎంతకో కొంతకీ అమ్మేసేవాళ్లే. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కష్టానికి ఫలితం దక్కింది. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన, 21 స్థానాల్లో కూడా ఆధిక్యం దిశగా సాగుతోంది. పవన్ కళ్యాణ్, పిఠాపురం నుంచి 70,354 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఇదే సమయంలో పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 59 వేల మెజారిటీతో గెలిచాడు.
జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో 90 వేలకు పైగా మెజారిటీ దక్కగా, ఈసారి అది సగానికి సగం పడిపోయింది. జగన్ కంటే పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ మెజారిటీ రావడం విశేషం. పవన్ కళ్యాణ్ విజయంపై అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
Pawan Kalyan – Trivikram : కోబలి మూవీ ఎందుకు ఆగిపోయిందంటే..!?
‘‘డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా… అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు ‘గేమ్ ఛేంజర్’వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది!! నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే… ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి..
పవన్ కళ్యాణ్ విజయంపై రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ట్వీట్ల ద్వారా అభినందనలు తెలిపారు.