Pawan Kalyan : 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌కి ఘోర పరాభవం ఎదురైంది. 175 స్థానాల్లో పోటీచేసిన జనసేన పార్టీ, ఒకే ఒక్క స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది. రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద రావు మాత్రమే జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా నిలిచాడు. అన్నింటికీ మించి రెండు స్థానాల నుంచి పోటీ చేసిన జనసేన నేత పవన్ కళ్యాణ్‌కి రెండు స్థానాల్లోనూ ఓటమి ఎదురైంది. సినిమాల్లో తిరుగులేని క్రేజ్, స్టార్‌డమ్ ఉన్న పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో ఇలాంటి ఓటమి ఎదురైన తర్వాత.. మనకెందుకీ రాజకీయాలు అని పార్టీని తీసేయొచ్చు..
అన్న చిరంజీవి దారిలో తన పార్టీలో వేరే పార్టీలో లీనం చేసి, ఏదో ఒక పదవిని అనుభవించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా చేయలేదు. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో అవమానాలు ఫేస్ చేశాడు, మరెన్నో కష్టాలను అనుభవించాడు. ఏసీ గదుల్లో అన్ని వసతులు ఉన్న వ్యానిటీ వ్యానులో రాజభోగాలు అనుభవించే పవన్ కళ్యాణ్, ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం మండుటెండలో నడిచాడు. చెమటతో స్నానం చేశాడు. ఆ కష్టాలను ఫలితం ఎట్టకేలకు దక్కింది..
Pawan Kalyan : ఎలక్షన్స్ అయిపోయాయి, పవన్ కళ్యాణ్ షూటింగ్‌లకి వచ్చేదెప్పుడు?
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కింగ్ మేకర్‌గా మారింది. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ, దాదాపు 19 నుంచి 20 స్థానాల్లో గెలిచేలా కనిపిస్తోంది. ఇది మామూలు విజయం కాదు. అఖండ విజయం. వైఎస్ జగన్ మీద ప్రజలకు ఎంత కోపం పెరిగినా, ఈసారి టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే రిజల్ట్ ఇలా మాత్రం ఉండేది కాదు. గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు వచ్చినా నిరాశ చెందకుండా, కృంగి పోకుండా పట్టు వదలకుండా పవన్ కళ్యాణ్ చేసిన పోరాటమే ఈ విజయానికి ప్రధాన కారణం. పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదంటే చాలామంది ఒప్పుకోకపోవచ్చు.
కానీ పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేసి ఉంటే, ఓటు బ్యాంకును కచ్ఛితంగా చీల్చేవాడు. ఇది వైసీపీకి కచ్ఛితంగా అనుకూలంగా మారి ఉండేది. 21 స్థానాల్లో పోటీ చేసి 90 శాతం స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పవన్ కళ్యాణ్, 175 స్థానాల్లో పోటీ చేసి ఉంటే, మిగిలిన స్థానాలకు పోటీ ఇచ్చే రేంజ్‌లోనే ఓట్లు దక్కించుకునేవాడు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణే అసలు సిసలైన ‘కింగ్’ మేకర్.. దీన్ని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే..