Pawan Kalyan OG : ఆ ఇద్దరు హీరోలతో పోటీ పడుతున్న పవర్ స్టార్..

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్, రాజకీయాలతో బిజీ కావడంతో అతని సినిమాల షూటింగ్స్‌ అన్నీ నిలిచిపోయాయి. అప్పుడెప్పుడో క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రకటించాడు పవన్. టీజర్ కూడా వచ్చాక ఈ ప్రాజెక్ట్ పట్టాలు తప్పింది. ఈ మూవీ తర్వాత మొదలైన ‘భీమ్లా నాయక్’, ‘Bro’ మూవీ థియేటర్లలోకి వచ్చాయి, వెళ్లాయి.. కానీ ‘వీరమల్లు’ రిలీజ్‌పై ఇంకా స్పష్టత రాలేదు.

‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ని పట్టించుకోని పవన్ కళ్యాణ్.. ప్రాజెక్ట్ పక్కనబెట్టేసిన హరీశ్ శంకర్..

ఈ మూవీ కంటే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘#OG’ మూవీ, అనౌన్స్‌మెంట్ నుంచి ఎన్నో అంచనాలు పెంచేసింది. అయితే పవన్ పాలిటిక్స్‌తో బిజీ కావడంతో ఆగిన ఈ మూవీ షూటింగ్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత తిరిగి ప్రారంభం కాబోతోంది.. ఈ మూవీ ఆడియో రైట్స్‌ని రూ.20 కోట్లకు విక్రయించారు. అలాగే ఓవర్‌ సీస్ రైట్స్‌కి కూడా మంచి రేటు వచ్చింది. ‘ఓజీ’ ఓవర్‌ సీస్ రైట్స్‌ని రూ.17 కోట్లకు అమ్మినట్టు సమాచారం.

ఏప్రిల్‌లో షూటింగ్ తిరిగి ప్రారంభమైనా, 15 రోజుల్లో సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడట సుజిత్.. ఇప్పటికే 72 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని, పవన్ కళ్యాణ్ పార్ట్ తప్ప, మిగిలిన షూటింగ్ అంతా పూర్తి చేసేశాడట సుజిత్.. ఏప్రిల్‌లో పవన్ షూటింగ్‌కి వస్తే, ఆగస్టులో థియేటర్లలోకి ‘OG’ వచ్చేస్తుంది. ఆగస్టులో రావాలని అనుకుంటున్న ఎన్టీఆర్ ‘దేవర’, అల్లు అర్జున ‘పుష్ప 2’ సినిమాలతో పవన్ మూవీ పోటీపడుతుంది. లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్.

సంక్రాంతి రేసు నుంచి ‘ఫ్యామిలీ స్టార్’ అవుట్… విజయ్ దేవరకొండ మూవీ వాయిదా పడనుందా..?

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post