Natural Star Nani : ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, స్టార్ హీరోగా ఎదిగాడు నేచురల్ స్టార్ నాని. ‘అంటే సుందరానికి’ మూవీ తర్వాత ‘దసరా’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో వరుస హిట్లు కొట్టాడు నాని. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోయినా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది ‘అంటే సుందరానికి’.. ఆ మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్న నాని, ఏకంగా ఐదు ప్రాజెక్ట్‌లను క్యూలో పెట్టాడు.. ‘సరిపోదా శనివారం’ డిజిటల్ రైట్స్ రూ.42 కోట్లకు అమ్ముడు పోయాయి. అంటే సినిమా విడుదలకు ముందు బెంచ్ ప్రాఫిట్స్ రాబట్టేసింది..
ఎన్టీఆర్- కృష్ణ మధ్య ఏం జరిగింది.. రామారావు సక్సెస్ చూసి తట్టుకోలేకనే..
శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవీ చేయాల్సిన నాని, ‘బలగం’ ఫేమ్ వేణుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. అలాగే ‘దసరా’ వంటి మాస్ హిట్ అందించిన శ్రీకాంత్ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయబోతున్నాడు నాని..
అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేశ్ – నాని కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడని సమాచారం. అలాగే ‘సాహో’ డైరెక్టర్ సుజిత్, నానితో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోవడంతో నానితో సినిమాను మొదలెట్టి, వీలైనంత త్వరగా ముగించాలని అనుకుంటున్నాడట సుజిత్.. నాని కోసం ఏకంగా ఐదుగురు డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.
నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?