Pawan Kalyan Janasena : అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చాడు. ప్రస్తుతం పోచంపల్లిలో ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ జరుగుతోంది. అటుగా వెళ్తున్న పవన్ కళ్యాణ్, అన్నయ్య షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకుని, ‘విశ్వంభర’ సెట్స్‌లో చిరంజీవిని కలిశారు. తమ్ముడి కష్టాన్ని చలించిపోయిన అన్నయ్య చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం, తదితర ఖర్చుల కోసం జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు.
బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ కోసం చిరంజీవి, దాదాపు రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు ఏపీ ఎన్నికల కోసం ‘హరిహర వీర మల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ సినిమాల షూటింగ్‌లను పక్కనబెట్టేశాడు పవన్ కళ్యాణ్.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ సినిమాల షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది.
Mega Family : మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న అల్లు ఫ్యామిలీ..
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీ రోల్ పోషించిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం జనసేన పార్టీకి అధినేతగా ఉన్నాడు. ప్రజారాజ్యం పార్టీని నడిపించలేక మెగాస్టార్ చిరంజీవి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల తర్వాత జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది.