OTT Movies in May : ‘మే’లో అలరించనున్న ఓటీటీ చిత్రాలు..

OTT Movies in May : మండుటెండల్లో వినోదాల జల్లు కురవనుంది. మే నెలలో బ్లాక్ బస్టర్ మూవీస్ ఓటీటీ లో రిలీజ్. కానున్నాయి. ఈ నెలలో వచ్చే మూవీస్ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం..

హీరామండి : ది డైమండ్ బజార్ మే 1న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఇందులో మనీషా కోయిరాల, సోనాక్షి సిన్హా, అతిథి రావు, హైందరి, రిచా చద్ధ, షాహిద్ షేక్, మరియు షర్మిన్ సగల్ మొదలగు వారు కీలక పాత్రలో నటించారు. లాహోర్ లో జరిగిన భారత స్వతంత్ర ఉద్యమ నేపథ్యానికి వ్యతిరేకంగా తెరకెక్కించిన చిత్రమిది.

యోధ : సాగర్ అంబ్రె , పుష్కర్ ఓజా డైరెక్షన్ లో వచ్చిన హిందీ థ్రిల్లర్ ‘యోధ’ లో సిద్ధార్థ్ మల్హోత్రా , రాశిఖన్నా, దిశా పటాని తదితరులు నటించారు. మార్చి 15న థియేటర్లో విడుదలైన “యోధ” మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Mahesh Babu – Thalapathy Vijay : మహేష్, విజయ్‌తో నెల్సన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. గెస్ట్ రోల్స్‌లో..

ఆడుజీవితం : విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళం సర్వైవల్ డ్రామా ‘ఆడు జీవితం_ది గోట్ లైఫ్ ‘. పృథ్వీరాజ్ సుకుమారన్, జిమ్మీ జీన్ లూయిస్ , కె.ఆర్ గోపాల్, అమలాపాల్, శోభ మోహన్ తదితరులు ఇందులో కీలకపాత్ర పోషించారు. ఈ మూవీ మే 10న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

మంజుమ్మేల్ బాయ్స్ : ఫిబ్రవరి 22న థియేటర్లలో విడుదలైన మలయాళం సర్వేవల్ థ్రిల్లర్ “మంజుమ్మేల్ బాయ్స్”. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. ఈ మూవీ మే 5 నుంచి నెట్ స్లిక్స్, హాట్ స్టార్ ల స్ట్రీమింగ్ కానుంది.

మడ్ గావ్ ఎక్స్ప్రెస్ : కునాల్ ఖేము దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. దివ్వెందు , ప్రతిక్ గాంధీ, అవినాష్ తివారి, నోరా ఫతేహి, ఉపేంద్ర లిమాయే, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

ది ఐడియా ఆఫ్ యు : మైఖేల్ సోవాల్టర్ డైరెక్షన్ లో వచ్చిన అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీ “ది ఐడియా ఆఫ్ యు”. మే 2 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది.

Malavika Mohanan : ఎప్పటికీ యాక్టింగ్ చేయను! నీకేంటి ప్రాబ్లెమ్… నెటిజన్‌కి మాళవిక మోహనన్ కౌంటర్..

సైతాన్ : వికాస్ బహెల్ దర్శకత్వం వహించిన చిత్రం “సైతాన్”. ఇందులో అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక, జాంకీ బోడివాలా, అంగద్ రాజు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం మే 3న నెట్ ఫిక్స్ లో హల్చల్ చేయనుంది.

క్రూ: రాజేష్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన సినిమా “క్రూ”. ఇందులో టబూ, కరీనాకపూర్ ఖాన్, కృత్తిహాసన్, హెయిర్ హోస్టర్ల గా నటించారు. ఈ మూవీ కూడా మే లోనే ఓటీటీలోకి రానుంది.

 

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post