ఓట్స్ ఊతప్పం..

Oats Uttapam Recipe

Oats Uttapam Recipe : ఓట్స్.. ఈ పేరు వింటేనే అమ్మో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది చాలామందికి. కానీ ఓట్స్ తింటే గుండెకు చాలా మంచిదంటారు. ఓట్స్ ని కేవలం పాలల్లోనే కాదు.. వాటితో టేస్టీ టిఫిన్ కూడా చేయచ్చు. వీకెండ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి, అందులోనూ ఆదివారం, మధ్యాహ్నం విందు భోజనాలు ఎక్కువ చేస్తారు. మరి కడుపును కాస్తైనా ఖాళీగా ఉంచితేనే, మీరు తినే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఓట్స్ ఉతప్పం రెసిపీ తయారీ విధానం చూసేద్దాం..

పాలిచ్చే తల్లులు తీసుకువాల్సిన ఆహారం..

కావాల్సిన పదార్థాలు :
* ఒక కప్పు ప్లైన్ ఓట్స్
* అర కప్పు జొన్న రవ్వ (లేదా ఇడ్లీ రవ్వ)
* ఒక క్యారెట్ తురిమినది
* నాలుగు పచ్చిమిర్చి (సన్నగా కట్ చేసుకోవాలి)
* ఒక ఉల్లిపాయ (సన్నగా కట్ చేసుకోవాలి)
* కొత్తిమీర
* ఒక కప్పు పెరుగు (ఓట్స్ తీసుకున్న కప్పుకి సమానంగా)
* 1/2 స్పూన్ పసుపు
* 1/2 స్పూన్ జీలకర్ర
* ఆయిల్

Oats Uttapam Recipe

తయారీ విధానం..
ఓట్స్, జొన్న రవ్వ, పెరుగు, నీళ్లు, ఉప్పు, జీలకర్ర, పసుపు అన్నీ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని కనీసం గంటైనా నాననివ్వాలి. (జాబ్ చేసేవాళ్లయితే నైట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకొని మార్నింగ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది.) ఒక గంట నానిన తర్వాత అందులో తురుముకున్న క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

SSMB29 కోసం సూపర్ స్టార్ కి జక్కన్న కండీషన్స్..

నెక్స్ట్ పాన్ పెట్టి ఆయిల్ వేసి చిన్న ఊతప్పంలా వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే.. ఎంతో రుచిగా ఉండే ఓట్స్ ఊతప్పం రెడీ.. మీరు ఇదే బాటన్ తో ఇడ్లీ వేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు సుమీ.. వీటిని మీరు అల్లం చట్నీ, పల్లి చట్నీ దేనితో తిన్నా బాగుంటుంది. లేదా రెండు స్పూన్ల పెరుగులో కొంచెం ఆవకాయ కలుపుకొని తిని చూడండి అద్భుతం అంతే..!

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post