Natural Star Nani : కొందరు శనివారం రోజు అస్సలు మాంసాహారం తినరు. మిగిలిన 6 రోజులు మాంసాహారులు ఉండి, శనివారం అంటే శుద్ధ శాకాహారాలుగా మారిపోతారు. అలాగే ఇంకొందరు ఆదివారం మాత్రమే నాన్-వెజ్ తింటారు. అదో డైట్ ఫార్ములా మరి.. ఇలా ఆహార అలవాట్లకేనా, కోపానికి కూడా ఓ రోజు సెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. సూర్య అదే చేశాడు.. ఎవరి మీద కోపం వచ్చినా దాన్ని ఆపుకుని, దాచుకుని.. శనివారం ఆ కసి మొత్తం చూపిస్తాడు. నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా కాన్సెప్ట్ ఇది.
Natural Star Nani : రేంజ్ పెంచుకుంటున్న నేచురల్ స్టార్..
వివేక్ ఆత్రేయ ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ చెప్పగానే అందరూ మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘శనివారం నాది’ నవల కాన్సెప్ట్ అని అనుకున్నారు. ఇప్పుడు నాని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘సరిపోదా శనివారం’ గ్లిప్స్ ఆ డౌట్స్‌ని ఇంకాస్త పెంచేలాగే ఉన్నాయి. అయితే నవలలో శనివారం రోజున కథా నాయకుడికి అద్భుత శక్తులు వచ్చి, సూపర్ హీరోగా మారి నగరంలో జరిగే అన్యాయాలను ఎదురిస్తూ ఉంటాడు.
మరి ‘సరిపోదా శనివారం’ మూవీ కూడా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిందా? లేదా? అనేది తెలియాలంటే ఆగస్టు 29వరకూ ఆగాల్సిందే. ఎస్.జె. సూర్య విలన్‌గా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్. ఈ మూవీ తర్వాత నాని, ‘బలగం’ ఫేమ్ వేణుతో సినిమా చేయాల్సి ఉంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, సుజిత్, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కూడా నాని డేట్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?