Nani – Sujeeth : ‘దసరా’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ‘దసరా’ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే, స్లోగా స్టార్ట్ అయినా ‘హాయ్ నాన్న’ మూవీ రూ.80 కోట్లకు పైగా రాబట్టింది.. ‘సరిపోదా శనివారం’ కూడా ఇలాంటి సక్సెస్ సాధిస్తే, ఇన్నాళ్లు టైర్ 2లో టాప్‌లో ఉన్న నాని, టైర్ 1లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. దానికి తగ్గట్టుగానే తన లైనప్ కూడా ప్లాన్ చేసుకున్నాడు నాని..
Natural Star Nani : రేంజ్ పెంచుకుంటున్న నేచురల్ స్టార్..
పవన్ కళ్యాణ్‌తో ‘OG’ సినిమా చేస్తున్న సుజిత్, నానితో సినిమా అనౌన్స్ చేశాడు. ‘RRR’ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య దీనికి నిర్మాత. అనౌన్స్ చేసినప్పుడే ఈ మూవీ బడ్జెట్ రూ.100 కోట్లు అని అంచనా వేశారు. అలాంటి సినిమా ఆరంభానికి ముందు ఈ మూవీ నుంచి నిర్మాత తప్పుకున్నాడు. దీంతో నాని, మరో ప్రొడ్యూసర్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి.
ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి ‘OG’ షూటింగ్‌లో అడుగుపెడతాడు. ఆ మూవీలో మిగిలిన 17 రోజుల షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సుజిత్, నానితో సినిమా మొదలెట్టాలని చూస్తున్నాడు. ఈలోపు నాని-సుజిత్ సినిమాకి ప్రొడ్యూసర్ దొరకాలి. లేదంటే ఈ మూవీ వేరే హీరోకి వెళ్లొచ్చు..
నాని సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతోంది? ‘హాయ్ నాన్న’ సినిమాకి హైదరాబాద్‌లో పెద్దగా థియేటర్లు దక్కలేదు. నితిన్ డిజాస్టర్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, డబ్బింగ్ సినిమా ‘యానిమల్ ’కి భారీగా థియేటర్లు ఇచ్చిన డిస్టిబ్యూటర్లు, నాని సినిమాకి అన్యాయం చేశారు. క్రేజ్‌కి, టాక్‌కి తగ్గట్టుగా ‘హాయ్ నాన్న’కి థియేటర్లు దక్కి ఉంటే ఈజీగా రూ.100 కోట్లు క్రాస్ చేసి ఉండేది ట్రేడ్ పండితుల అంచనా. ఇప్పుడు నాని-సుజిత్ సినిమా విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది.