నాని ‘హాయ్ నాన్న’ సినిమాని తొక్కేస్తున్న దిల్ రాజు..

Nani fans disappointed with Dil Raju : ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, టాప్ హీరోగా మారాడు నాని. ‘దసరా’ మూవీతో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన నాని, మాస్ జాతర లాంటి మూవీ తర్వాత క్లాస్ ఫ్యామిలీ మూవీ ‘హాయ్ నాన్న’ చేశాడు. ఈ మూవీకి మంచి పాజిటివ్ రివ్యూలు దక్కాయి. ఈ సినిమాకి పోటీగా వచ్చిన నితిన్ సినిమా, ‘ఎక్స్‌ట్రా’ ఆర్డినరీగా తేల్చడంలో కలెక్షన్లు రావడం లేదు.

Hi నాన్న మూవీ రివ్యూ: నాని ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…

‘హాయ్ నాన్న’ మూవీకి మంచి కలెక్షన్లు వస్తున్నా, థియేటర్లు పెరగడం లేదు. దీనికి కారణం దిల్ రాజు. ‘యానిమల్’ మూవీని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటికే ‘యానిమల్’ మూవీ ద్వారా రూ.18 కోట్ల లాభాలు అందుకున్నాడు కూడా. ఈ లాభాలను మరింత పెంచుకునేందుకు ‘యానిమల్’ మూవీకి హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో థియేటర్లు కేటాయించాడు దిల్ రాజు.

నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?

10 రోజుల ముందు రిలీజ్ అయిన ‘యానిమల్’ హైదరాబాద్‌లో 410 షోస్‌లో ప్రదర్శితమవుతోంది. రెండు రోజుల ముందు రిలీజ్ అయిన తెలుగు సినిమా ‘హాయ్ నాన్న’ మూవీకి మాత్రం 320 షోస్ మాత్రమే దక్కాయి. బుక్ మై షోలో ‘హాయ్ నాన్న’కి హైదరాబాద్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్నట్టు స్పష్టంగా తేలిపోయింది. అయినా సరే, ‘యానిమల్’ షోస్ తగ్గించకుండా, నాని సినిమాని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు దిల్ రాజు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post