Music Day 2024 : భారతీయ సంగీతం అనేక శతాబ్దాలుగా ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేస్తోంది. ప్రాశ్చాత్య సంగీతంతో పోలిస్తే భారతీయ సంగీతం వైవిధ్యం, సంప్రదాయాలు, సాంకేతికతలతో ప్రసిద్ధి పొందింది. భారతీయ సంగీతం రెండు ప్రధాన విభాగాల్లో విభజించబడింది. అది కర్ణాటిక్ సంగీతం,హిందుస్తానీ సంగీతం.
కర్ణాటిక్ సంగీతం :
కర్ణాటిక్ సంగీతం, దక్షిణ భారతదేశంలో పుట్టి శాస్త్రీయ సంగీత రూపంలో విస్తరించింది.. కర్ణాటిక్ సంగీతం మూలాలు సాంప్రదాయాలు, భక్తి పాటలలో నిండి ఉన్నాయి. ఇది రాగ, తాళాల ఆధారంగా ఉంటుంది. కర్ణాటిక్ సంగీతంలో ప్రఖ్యాత సంగీతకారులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామా శాస్త్రి మొదలైనవారు..
హిందుస్తానీ సంగీతం :
హిందుస్తానీ సంగీతం ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందింది. ఇది మొగల్ పాలన కాలంలో ఎక్కువగా విస్తరించింది. ఈ సంగీతంలో కూడా రాగాలు, తాళాలు ఆధారంగా ఉంటాయి.. థాన్సేన్, రవిశంకర్ వంటి కళాకారులు హిందుస్తానీ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు.
Tollywood Inside Facts : స్టార్లకు కోట్ల రెమ్యూనరేషన్లు! ఆర్టిస్టుల పొట్ట కొడుతూ..
భారతీయ సంగీతంలో రాగాలు ప్రధానమైనవి. రాగం అనేది స్వరాల సముదాయం. ఇది ఒక నిర్దిష్టమైన భావాన్ని సృష్టిస్తుంది. తాళం అనేది శాస్త్రీయ సంగీతంలో ముఖ్యమైన అంశం. ఇది ఒక నిర్దిష్ట లయను లేదా బీట్‌ని సూచిస్తుంది. ప్రతి తాళానికి నిర్దిష్టమైన సమయ చక్రాలు ఉంటాయి. భారతీయ సంగీతంలో విభిన్నమైన వాద్యాలు ఉపయోగిస్తారు. ఉదాహరణకు సితార్, వయోలిన్, తబలా, మృదంగం..
కాలక్రమేణా భారతీయ సంగీతం, పాశ్చాత్య సంగీతంతో అనుసంధానమై, కొత్త కొత్త శైలులుగా మారి ఫ్యూషన్ సంగీతాన్ని తీసుకువచ్చింది. ఇది యుక్తుల మధ్య ఎంతో ప్రాచుర్యం పొందింది. భారతీయ సంగీతం, ప్రపంచానికి అందించిన ఓ గొప్ప బహుమతి.. ఇది మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేకతను గుర్తుచేసుకుందాం…