MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ ఫాలోయింగ్ వేరే లెవెల్. మాహీని దేవుడిగా కొలుస్తారు చాలామంది వీరాభిమానులు. మాహీ వస్తున్నాడంటే చెన్నై టు ఢిల్లీ ఎక్కడైనా స్టేడియమంతా ఎల్లో మయం అవ్వాల్సిందే. మాహీ కెరీర్ మొదటి నుంచి BAS అనే స్టిక్కర్ ఉన్న బ్యాటులనే వాడాడు. అందరూ బ్రిటానియా, అడిడాస్ వంటి కంపెనీల స్టిక్కర్లు పెట్టుకుని ప్రమోట్ చేస్తే, మాహీ మాత్రం ఓ ఊరు పేరు లేని BAS స్టిక్కర్ ఎందుకు వేసుకున్నాడు. ఇలా ఆరా తీసిన చాలా మంది, ఈ బ్యాట్ కోసం వెతికి మరీ ఆ షాపు దగ్గరికి వెళ్లి కొనుక్కున్నారు.
Ram Charan Bollywood : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చెర్రీ..
అది ధోనీ స్నేహితుడిది. చిన్నతనంలో తనకి ఎంతో సాయం చేసిన స్నేహితుడు సోమి కోహ్లీ కోసం ఈ స్టిక్కర్ వాడుతూ వచ్చాడు మాహీ. ‘2019 వరల్డ్ కప్ సమయంలో ధోనీ వాడే బ్యాట్ల కోసం మాకు చాలా ఆర్డర్లు వచ్చాయి. మంచి లాభాలు వచ్చాయి. ఆ సమయంలో డబ్బులు తీసుకోమని కోరాను. అతని తల్లిదండ్రులు, భార్య, స్నేహితులు కూడా డబ్బులు వస్తుంటే ఎందుకు కాదంటావ్ అన్నారు. కానీ మాహీ మాత్రం తీసుకోలేదు. తనకు చిన్నతనంలో నేను చేసిన చిన్న సాయానికి రుణం తీర్చుకుంటున్నానని చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చాడు సోమి కోహ్లీ..
BAS అంటే Beat All Sports. ప్రస్తుతం ఈ కంపెనీ ఏడాదికి రూ.5 కోట్ల వరకూ వ్యాపారం చేస్తోందని ట్రేడ్ సమాచారం. 2024 ఐపీఎల్‌లో ధోనీ రిటైర్ అవుతుండడంతో BAS బ్యాట్ల కోసం భారీగా ఆర్డర్లు వస్తున్నాయట.