క్రిమినల్ కేసులు ఉంటేనే ఎమ్మెల్యే సీటు! బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో సగం మంది..

MLA Candidate Eligibility : రాజకీయాల్లో రాణించాలంటే ఏ అర్హత ఉండాలి? అని అడిగితే, పెద్దగా చదువు కోకపోయినా పర్లేదు, జనాల కష్టాల గురించి, వారి అవసరాల గురించి కనీస జ్ఞానం లేకపోయినా పర్లేదు.. ఓ రెండు మర్డ* కేసులు, కనీసం మూడు రే* కేసులు ఉండాలి! ఎన్ని క్రిమినల్ కేసులు ఉంటే, అంత పెద్ద రాజకీయ నాయకుడివి అవుతావని సమాధానం చెబుతాడు పరుచూరి గోపాలకృష్ణ.

గ్లాసు గుర్తు లేకుండానే జనసేన పోటీ చేస్తోందా? ఈ వార్తల్లో నిజమెంత?

దేశ రాజకీయాలకు అద్ధం పడుతూ సెటైరికల్‌గా రాసిన ఈ డైలాగ్, తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్న 118 మంది ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నారు. వీరిలో అధికార బీఆర్‌ఎస్ పార్టీలో 59 మంది ఎమ్మెల్యేలు వివిధ సెక్షన్ల కింద విచారణ ఎదుర్కొంటున్నారు.

MLA Candidate Eligibility

ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో చిల్లర దొంగతనాలు, 420 కేసులే కాదు, 307 సెక్షన్ కింద హత్యాయత్నం, మర్డ*, రే* వంటి తీవ్ర నేరాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ADR) అనే సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది.

ఏంఐఎం పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు అయితే, హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో నలుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. బీజేపీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఈ సంస్థ అధ్యయనంలో తేలింది.

ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవలో తలదూరుస్తున్న అమెరికా.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..

నామినేషన్‌కి ముందు ఎలక్షన్‌ కమిషన్‌కి సమర్పించే అఫిడవిట్‌లో క్రిమినల్ కేసులకు సంబంధించిన రికార్డులు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే 2018 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో వీరిలో చాలామంది తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేనట్టుగా పేర్కొన్నారు. కేవలం 20-30 శాతం మంది అభ్యర్థులు మాత్రమే అఫిడవిట్‌లో క్రిమినల్ రికార్డులను చూపించారు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post