Israel – Palestine Conflict : ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా, వెంటనే తలదూర్చడం అమెరికాకి అలవాటు. ప్రపంచ దేశాల పెద్దన్న హోదాని తనకి తాను ఇచ్చుకున్న అమెరికా, తాజాగా ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవపై స్పందించింది.
లార్డ్ కృష్ణ మంత్రాలు నేర్చుకుంటున్న అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థులు..
గాజాలో ఇజ్రాయిల్ దళాలు విధ్వంసం సృష్టిస్తూ, హమాస్ సైన్యంతో సాధారణ ప్రజలపై కూడా దాడులు చేస్తున్నాయి. హమాస్ సైన్యం పూర్తిగా అంతం అయ్యేదాకా ఈ యుద్ధం ఆగదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశాడు కూడా.. ఇన్నాళ్లు ఈ యుద్ధంపై సైలెంట్‌గా ఉన్న అమెరికా, పరోక్షంగా పాలస్తీనాకి మద్ధతు ప్రకటించింది.
గాజాపై జరుగుతున్న దాడులను, ఆక్రమణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కామెంట్ చేశాడు. అమెరికా జోక్యంతో ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం మరింత పెరిగే ప్రమాదం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
యుద్ధానికి ముందు గాజాలో ఉన్న పరిస్థితులను తిరిగి తీసుకురావడం వచ్చే పదేళ్లలో జరగని పని. ఇజ్రాయిల్ దృష్టిలో గాజా ఇప్పుడు హమాస్ సైన్యంతో నిండిన ఓ అతి పెద్ద ఉగ్ర స్థావరంగా మారింది. దీన్ని తిరిగి హస్తగతం చేసుకునేందుకు ఇజ్రాయిల్ దళాలు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నాయి. అమెరికా జోక్యంతో ఈ పరిస్థితి తగ్గుతుందా? లేక మరింత పెరుగుతుందా? లేక ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అనే భయాందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
నో నట్ నవంబర్.. అసలేంటి NNN! ఆపుకోవడం మంచిదేనా..