Megastar Vishwambhara : మెగాస్టార్ సినిమా నుంచి స్టార్ రైటర్ అవుట్..

Megastar Vishwambhara : రీఎంట్రీలో రీమేక్ సినిమాలు చేసుకుంటూ, హాయిగా గడిపేస్తూ వచ్చాడు చిరంజీవి. అయితే మెహర్ రమేశ్ ‘భోళా శంకర్’ దెబ్బకు రీమేక్ సినిమాలంటే భయపడిపోతున్నాడు. అప్పటికే ప్రకటించిన మూడు రీమేక్ సినిమాలు కాకుండా కళ్యాణ్‌రామ్ ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా మొదలెట్టాడు మెగాస్టార్ చిరంజీవి.

SSMB 29 : రాజమౌళి – మహేష్ సినిమా ఉంటుందా? లేదా..

త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరో ఆరుగురు హీరోయిన్లు కూడా నటించబోతున్నారు. తొలుత ఈ సినిమాలో హీరోయినే ఉండదని దర్శకుడు ప్రకటించాడు. అయితే సెట్స్‌ మీదకి వెళ్లేలోపు మెగా ఫ్యాన్స్ ఫీల్ కాకుండా చిరూ, మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఈ మూవీకి స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించాల్సింది..

అయితే సినిమా సెట్స్‌ మీదకి వెళ్లిన నెల రోజులకే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు సాయిమాధవ్ బుర్రా. ‘ఖైదీ నెం.150’, ‘సైరా నరసింహా రెడ్డి’ వంటి సినిమాల కోసం చిరంజీవితో కలిసి పనిచేసిన సాయి మాధవ్ బుర్రా, ‘RRR’ తర్వాత ‘కల్కి 2898AD’, ‘హరిహర వీరమల్లు’ వంటి సినిమాలు చేస్తున్నాడు. సాయి మాధవ్, మెగాస్టార్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి కారణాలేంటి? అనేది తెలియాల్సి ఉంది..

Ram Charan : రామ్ చరణ్‌ని అవమానించిన షారుక్ ఖాన్..!

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post