Mega Family Rare Pic : పవన్ కళ్యాణ్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా..!?

Mega Family Rare Pic : టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవిదే. చిరంజీవి తర్వాత ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్‌ ఇండస్ట్రీలోకి వచ్చారు. మెగా తనయుడు రామ్ చరణ్‌, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక ఇండస్ట్రీలోకి రాగా ఆయన మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ హీరోలుగా ఉన్నారు. ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎంతమంది ఉన్నా అన్నయ్య మెగాస్టార్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ వేరు.

Bryan Johnson : రోజుకి 100 మాత్రలు, వయసును తగ్గించుకోవడానికి ఏడాదికి రూ.17 కోట్లు..

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్, చెల్లుళ్లు విజయ దుర్గ, మాధవి కలిసి దిగిన ఓ రేర్ ఫోటో ఇది. ఇందులో అప్పటికే హీరోగా మారిన చిరంజీవి, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ ఫోజు ఇస్తే.. మెగా బ్రదర్ నాగబాబు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో కనిపించాడు. పెద్ద చెల్లెలు విజయ దుర్గ చీరలో ఉంటే, చిన్న చెల్లెలు మాధవి స్టైల్‌గా ఫోజిచ్చింది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ వైట్ కలర్ షర్ట్‌ని కాస్త పైకి మడత పెట్టి, పొట్టి నిక్కరుతో ఉన్నారు.

నూనుగు మీసాలు, జట్టుకు నూనె రాసి, చెల్లెలి మీద చేతులు వేసి ఫోటోకి ఫోజు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ‘గుడుంబా శంకర్’, ‘బాలు’ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఎన్ని రకాల కాస్టూమ్స్ వేసినా, ఇలా ఓ సాధారణ మధ్యతరగతి టీనేజ్ యువకుడిలా చూడడం మాత్రం అరుదు. అందుకే ఈ ఫోటో, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌కి ఫెవరెట్‌గా మారింది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post