Mahesh Babu – Thalapathy Vijay : మహేష్, విజయ్‌తో నెల్సన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. గెస్ట్ రోల్స్‌లో..

Mahesh Babu – Thalapathy Vijay : ‘డాక్టర్’, ‘బీస్ట్’, ‘జైలర్’ సినిమాలతో కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా మారాడు నెల్సన్ దిలీప్‌కుమార్. నయనతారతో ‘కోకిల’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన నెల్సన్, వరుస ఫ్లాపుల్లో ఉన్న రజినీకాంత్‌కి రూ.700 కోట్ల ‘జైలర్’ సినిమా ఇచ్చాడు. ‘జైలర్’ మూవీలో కన్నడ స్టార్ హీరో శివ్ రాజ్‌కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్ గెస్ట్ అప్పీరియెన్స్ ఇచ్చారు. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణతో కూడా చిన్న రోల్ చేయించాలని అనుకున్నాడు నెల్సన్. అయితే కథలో ఆయనకు తగ్గ పవర్ ఫుల్ పాత్ర దొరకకపోవడంతో బాలయ్యను పెట్టలేకపోయాడు.

అయితే ప్రస్తుతం తలపతి విజయ్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు నెల్సన్ దిలీప్‌కుమార్. ఈ మూవీలో విజయ్‌తో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని నడిపిచేయాలని అనుకుంటున్నాడట నెల్సన్. తెలుగులో మహేష్ చేసిన సినిమాలను రీమేక్ చేసి, స్టార్ స్టేటస్ అందుకున్నాడు విజయ్. మహేష్ చేసిన ‘ఒక్కడు’, ‘అతడు’, ‘పోకిరి’ వంటి సినిమాలే విజయ్‌కి అక్కడ స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.

Venky Atluri : మనవాళ్లతో రాడ్ సినిమాలు! వాళ్లతో క్లాసిక్ సినిమాలు..

దీంతో మహేష్, విజయ్‌ని ఒకే స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేస్తున్నాడట నెల్సన్. ఈ మూవీలో గెస్ట్ రోల్స్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, మలయాళ మెగాస్టార్ మమ్మూట్టీ కూడా కనిపించబోతున్నారని టాక్. అయితే ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్న మహేష్, గెస్ట్ రోల్‌లో కనిపించేందుకు ఒప్పుకుంటాడా? మహేష్ ఇప్పటిదాకా గెస్ట్ రోల్స్ చేసింది కూడా లేదు. ‘జల్సా’, ‘బాద్‌షా’, ‘ఆచార్య’, ‘మనసుకు నచ్చింది’ వంటి సినిమాలకు వాయిస్ ఓవర్ అందించాడు మహేష్ బాబు.. మల్టీస్టారర్ అయితే మహేష్ ఓకే చెప్పొచ్చు. ఇంతకుముందు వెంకీతో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించాడు మహేష్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post