Maharaja Movie Review : విజయ్ సేతుపతి విశ్వరూపం..

Maharaja Movie Review
Maharaja Movie Review

Maharaja Movie Review : ‘ఉప్పెన’ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతి, ‘పిజ్జా’ వంటి ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమే. విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమా ‘మహారాజ’, జూన్ 14న విడుదలైంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమతా మోహన్‌దాస్, అనురాగ్ కశ్యప్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Kannada Actor Darshan : చెంపదెబ్బ కొట్టాను, చంపలేదు..

ఓ కటింగ్ షాపు ఓనర్ మహారాజ, ఓ చెత్త డబ్బా పోయిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాడు. చెత్త డబ్బా అని చెప్పకుండా లక్ష్మీ పోయిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ సాగిస్తారు. అది చెత్త డబ్బా అని తెలియడంతో మహారాజకి పిచ్చి ఏమోనని అనుకుని, చేయి చేసుకుంటారు. అయితే ఆ చెత్త డబ్బాని తిరిగి కనిపెట్టేందుకు తాను కష్టపడి సంపాదించిన రూ.7 లక్షలు, లంచంగా ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. ఓ చెత్త డబ్బా కోసం అంత లంచం ఇవ్వడానికి సిద్ధం కావడంతో పోలీసులకు అనుమానం వస్తుంది.

అసలు ఆ చెత్త డబ్బాలో ఏముంది? దానికి లక్ష్మీ అని ఎందుకు పేరు పెట్టాడు? ఈ విషయాలన్నీ తెర మీద చూడాల్సిందే. విజయ్ సేతుపతి ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించేశాడు. ఎమోషన్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లోనూ జీవించేశాడు. అప్పుడెప్పుడో వచ్చిన ‘అంజలి సీబీఐ’ తర్వాత అనురాగ్ కశ్యప్‌కి మరోసారి మంచి క్యారెక్టర్ దక్కింది.

Harom Hara Movie Review: సుధీర్ బాబు మాస్ కమ్‌బ్యాక్..

‘మహారాజ’ సినిమాకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే స్క్రీన్ ప్లే, దానికి తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ నిథిలన్. ఇంటర్వెల్ ట్విస్టుతో పాటు సెకండాఫ్ ఆలోచింపచేస్తుంది. ఎమోషనల్‌గా సినిమాని ముగించేశాడు డైరెక్టర్. కథకు అడ్డం పడే పాటలు లేకపోవడం ‘మహారాజ’ మూవీకి మరో ప్లస్ పాయింట్. ఓవరాల్‌గా ఓ మంచి మెసేజ్, యాక్షన్, ఎమోషనల్ ప్యాక్ డ్రామా చూడాలనుకునేవారికి ‘మహరాజ’ కచ్ఛితంగా నచ్చుతుంది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post