Lambasingi Movie Review :‘బిగ్ బాస్’ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన దివి అద్వైత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘లంబ సింగి’. నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలు తీసిన కళ్యాణ్ కృష్ణ నిర్మాతగా కొత్త దర్శకుడు నవీన్ గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది.
లంబసింగి ఏరియాలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసే హీరో, అదే ఏరియాల్లో నక్సలైట్ అయిన హీరోయిన్‌ని చూసి ప్రేమలో పడతాడు. ఓ పోలీస్, నక్సలైట్ మధ్య ప్రేమ కథ ఎలా సాగింది. ఎలా ముగిసింది? అనేదే లంబ సింగి కథ..
Dhanush Kubera : అండర్ వరల్డ్‌ని శాసించే బిక్షగాడి కథతో కుబేరా..
ఓ పోలీస్, నక్సలైట్ మధ్య ప్రేమ అనే పాయింట్‌తో ఇంతకుముందు విజయ్ శాంతి ‘అడవి చుక్క’ అనే సినిమా వచ్చింది. అయితే అందులో ప్రధానంగా ఊరి సమస్యలు చూపిస్తే, ఇందులో ప్రేమ కథ చుట్టే సినిమా నడుస్తుంది. హీరోయిన్ నక్సలైట్ అనే పాయింట్ తప్ప, కథనంలో ఎలాంటి కొత్తదనం కనిపించదు.
దివి చాలా అందంగా ఉంటుంది. అంతే అందంగా సినిమాలో చూపించాడు డైరెక్టర్. హీరోగా భరత్ రాజ్ పర్వాలేదనిపించాడు. మిగిలిన పాత్రల్లో నటులు చక్కగా నటించినా ఎమోషన్స్ పెద్దగా వర్కవుట్ కాలేదు. ధృవన్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు. కొన్ని పాటలు ఇప్పటికే మంచి హిట్టు అయ్యాయి కూడా… లంబ సింగి అందాలను సినిమాటోగ్రాఫర్ చక్కగా చూపించాడు.
ఈ మధ్య నక్సలైట్ కథలతో ‘ఆచార్య’, ‘విరాటపర్వం’ వంటి సినిమాలు వచ్చాయి. ‘విరాట పర్వం’ ఓ హృదమైన ప్రేమ కథను చూపించింది. ‘లంబ సింగి’ మూవీలో ప్రేమ కథ రాసుకున్నా, దాన్ని ఆకట్టుకునే కథనంతో తెరకెక్కించడంలో దర్శకుడు తేలిపోయాడు. ఫస్టాఫ్ బోరింగ్‌గా సాగి, ఇంటర్వెల్ ట్విస్టుతో కాస్త క్యూరియాసిటీ క్రియేట్ చేసినా.. సెకండాఫ్‌లో దాన్ని కొనసాగించలేకపోయాడు. మొత్తానికి ‘లంబ సింగి’ దివి కోసం చూసే అభిమానులకు నచ్చొచ్చు.
Karisma Kapoor : నన్ను, తన స్నేహితుల దగ్గరికి పంపేవాడు! కరిష్మా కపూర్ సంచలన ఆరోపణలు..