Karisma Kapoor : 90ల్లో బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వరుస సినిమాలు చేసింది కరిష్మా కపూర్. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే సంజయ్ కపూర్ అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది కరీష్మా.. అయితే 13 ఏళ్ల వివాహ జీవితం తర్వాత వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు.. 2003లో ఘనంగా జరిగిన సంజయ్ కపూర్, కరిష్మా వివాహం… కలహాలతో, సంచలన ఆరోపణలతో పెటాకులైంది.
Ram Charan Bollywood : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చెర్రీ..
2005లో వీరికి సమైరా కపూర్ అనే కూతురు పుట్టగా, 2010లో కియాన్ అనే అబ్బాయి పుట్టాడు. అంతా సఖ్యంగా నడుస్తున్న సమయంలో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. 13 ఏళ్ల కాపురం తర్వాత సంజయ్ కపూర్, కరీష్మా కేవలం తన డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందని ఆరోపించాడు. విడాకుల తర్వాత తాను చాలా నష్టపోయానని కూడా వాపోయాడు..
కరీష్మా, తన మాజీ భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. సంజయ్, తన వ్యాపార ప్రయోజనాల కోసం స్నేహితుల దగ్గరికి వెళ్లి గడపాల్సిందిగా బలవంత పెట్టేవాడని, హానీమూన్‌లోనే ఇలా చేయడంతో షాక్ అయ్యానంటూ ఆరోపించింది కరీష్మా. అయితే కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కరీష్మా, అలాంటి వ్యక్తితో 13 ఏళ్లు ఎలా కాపురం చేసింది? ఇద్దరు పిల్లలు పుట్టాక ఇలాంటి ఆరోపణలు చేయడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది..
కెరీర్ ఆరంభంలో అజయ్ దేవ్‌గణ్‌తో డేటింగ్ చేసిన కరీష్మా కపూర్, ఆ తర్వాత బిగ్ బీ కొడుకు అభిషేక్ బచ్చన్‌తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అయితే కొన్నిరోజులకే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని, బిజినెస్‌మ్యాన్ సంజయ్‌ని పెళ్లి చేసుకుంది. అజయ్ దేవగణ్, కాజోల్‌ని.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
Bollywood : బాలీవుడ్ పనైపోయిందా..!?