Kalki 2898AD Movie Story : ధర్మాన్ని పాలిస్తూ, అత్యంత సత్యవంతుడిగా పేరొందిన పాండవుల్లో అగ్రజుడు ధర్మరాజు ఆడిన ఓ అబద్ధమే.. ‘కల్కి 2898AD’ మూవీ స్టోరీకి కీ పాయింట్. అలా ఎలా? ధర్మరాజు ఆడిన అబద్ధం ఏంటి? పాండవుల గురువైన ద్రోణాచార్యుడు, కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవుల వైపు యుద్ధం చేయాల్సి వచ్చింది. అస్త్ర విధ్యల, సకల కళల్లో సాటి అయిన గురువు యుద్ధంలో అడుగుపెట్టడంతో పాండవుల సైన్యం తుడిచిపెట్టుకుపో సాగింది. దీంతో ద్రోణాచార్యుడుతో అస్త్ర సన్యాసం చేయించడం ఒక్కటే, ఆయన్ని ఆపేందుకు మార్గమని శ్రీకృష్ణుడు, పాండవులకు ఉపదేశించాడు.
కానీ ద్రోణాచార్యుడుతో అస్త్ర సన్యాసం చేయించేది ఎలా? కొడుకు అశ్వత్థామ చనిపోయాడని చెబితే, ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. కానీ చిరంజీవి అయిన అశ్వత్థామని చంపేదెవ్వరు? దీంతో అబద్ధం ఒక్కటే, ద్రోణాచార్యుడిని ఆపేందుకు మార్గంగా ఎంచుకున్నాడు శ్రీకృష్ణుడు.. అయితే అబద్ధం ఎవరు చెప్పినా ద్రోణాచార్యుడు నమ్మడు. అబద్ధం చెప్పేవాడు, ఎప్పుడూ అబద్ధం ఆడని ధర్మవంతుడు అయ్యుండాలి. అందుకే ధర్మరాజు చేతనే అబద్ధం చెప్పించాలని అనుకున్నాడు శ్రీకృష్ణుడు.
Animal vs Maharaja: రణ్‌బీర్ చేస్తే తిట్టారు.. ‘మహారాజ’ మూవీలో విజయ్ సేతపతి చేస్తే..
అయితే తాను ప్రాణం పోయినా అబద్ధం చెప్పనని ధర్మరాజు మొండికేశాడు. దీంతో అబద్ధం చెప్పకు, నిజాన్ని దాచిపెట్టు.. అని ఓ కిటుకు చెప్పాడు శ్రీకృష్ణుడు. యుద్ధంలో మరణించిన ఓ ఏనుగుకి అశ్వత్థామ అని పేరు పెట్టాడు. ద్రోణాచార్యుడు దగ్గరికి వెళ్లి, ‘అశ్వత్థామ హతః’ (అశ్వత్థామ చనిపోయాడు) అని గట్టిగా చెప్పి, ‘కుంజరహాః’ (ఏనుగు) అని నెమ్మదిగా చెప్పమని కృష్ణుడు చెప్పడంతో అలాగే చేశాడు ధర్మరాజు..
కొడుకు చనిపోయాడనే బాధతో ద్రోణాచార్యుడు, తన విల్లును పక్కనబెట్టడం.. ఆ తర్వాత అర్జునుడు, ద్రోణాచార్యుడుపై బాణం సంధించడం జరిగిపోయాయి. తండ్రి ద్రోణాచార్యుడి మరణవార్త తెలుసుకున్న అశ్వత్థామ, పాండవుల వంశం నిర్వశం చేయడానికి వారి గూఢరాల్లోకి దూరి, నిద్రపోతున్న మనవళ్లు, మనవరాళ్లను సంహరిస్తాడు. అంతటితో ఆగక అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డపైకి బ్రహ్మాస్త్రం సంధిస్తాడు..
Kalki 2898AD Movie : మరోసారి తెలుగువారిపై అక్కసు.. ఈ అరవోళ్లు మారరా..
ఈ పని కారణంగానే అశ్వత్థామ, భూమి ఉన్నంత వరకూ చీము, నెత్తురుతో బాధపడుతూ గుహల్లో తలదాచుకుంటూ బతకాలని శపిస్తాడు శ్రీకృష్ణుడు. ఇదే పాయింట్‌తో తెరకెక్కింది ‘కల్కి 2898AD’ మూవీ.
దీని గురించే నితిన్ Lie సినిమాలో ‘కోట్ల మంది సైనికులు సరిపోలేదట. పంచపాండవులు సాధించలేదట. చివరికి కృష్ణుడు ఒంటరి కాదట.. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తి అవ్వదట.. అశ్వత్థామ హతః కుంజరహః’ డైలాగ్ ఉంటుంది.