Indian 2 Trailer : రాజమౌళి, మణిరత్నం మాదిరిగానే శంకర్ తీసే సినిమాలకు తెలుగు, తమిళ్, హిందీల్లో క్రేజ్ ఉంటుంది. శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ మూవీ, జూలై 12న విడుదల అవుతోంది. ఈ సినిమాకి సీక్వెల్ ‘భారతీయుడు 3’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘భారతీయుడు 2’ రిలీజ్ అయ్యాక 3 నెలల గ్యాప్‌లో ‘భారతీయుడు 3’ కూడా విడుదల అవుతుంది. అయితే ‘భారతీయుడు 2’ ట్రైలర్లో శంకర్ మార్క్ ఎక్కడా కనిపించలేదు..
అవినీతి, అన్యాయాలతో ప్రభుత్వ ఆఫీసులు నిండిపోవడం, అవి చూసి తట్టుకోలేని ఓ యువకుడు (సిద్ధార్థ).. వాటిని అరికట్టడానికి న్యాయబద్ధంగా పోరాటం చేస్తూ ఉంటాడు. సాయం కోసం అమెరికాలో సెటిల్ అయిన సేనాపతిని పిలుస్తాడు. సేనాపతి, ఈ అవినీతిని ఎలా అడ్డుకున్నాడు. అహింస పద్దతితో పోరాటం చేసే సిద్ధార్థ, అల్లరి చేస్తే కొట్టి బుద్ధి చెప్పాలనుకునే భారతీయుడి హింసా మార్గాన్ని అడ్డుకోగలిగాడా? ఇదే ట్రైలర్ ద్వారా చూపించిన ‘భారతీయుడు 2’ స్టోరీ..
Pawan Kalyan – Supriya : అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి.. 28 ఏళ్లు అయ్యింది, అయినా ఏం మారలేదు!
‘భారతీయుడు’ సినిమాలో కొడుకుని చంపినట్టుగా, ‘భారతీయుడు 2’ సినిమాలో సిద్ధార్థ అసలైన విలన్‌గా క్లైమాక్స్‌లో రివీల్ చేసి చంపేస్తే.. పాత ట్విస్టుని రిపీట్ చేసినట్టు అవుతుంది. అలాకాకుండా సిద్ధార్థ్‌ని సెకండ్ హీరోగానే పెడితే రొటీన్‌గా మారుద్ది. ఈ సినిమాని అటు కమల్ కానీ, ఇటు శంకర్ కానీ మనసుపెట్టి చేసినట్టు ఎక్కడా కనిపించడం లేదు. కమల్ హాసన్ మేకప్, మేకోవర్ చూస్తే మొదలెట్టిన ప్రాజెక్టును ఎలాగైనా ముగించాలని మొక్కుబడిగానే పనులు చేసినట్టుగానే ఉంది.