Kalki 2898AD Movie Records : కొత్త టార్గెట్ సెట్ చేస్తున్న ప్రభాస్..

Kalki 2898AD Movie Records
Kalki 2898AD Movie Records

Kalki 2898AD Movie Records : టాలీవుడ్‌లో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇప్పటిదాకా బాక్సాఫీస్ రికార్డులన్నీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పేరు మీదే ఉన్నాయి. ‘బాహుబలి 2’, ‘RRR’ సినిమాలతో రికార్డులను తుడిచి పెట్టేశాడు ప్రభాస్. అయితే ఇప్పుడు ప్రభాస్ కూడా జక్కన్నకు పోటీ ఇస్తున్నాడు. ‘సలార్’ సినిమాతో రూ.720 కోట్లు రాబట్టిన ప్రభాస్, ‘కల్కి 2898AD’ సినిమాతో ‘బాహుబలి’ రికార్డులపైనే కన్నేశాడు..

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌ జోరుకి ‘కల్కి 2898AD’ మూవీ, తొలి రోజు రూ.200 కోట్లు రాబట్టేలా కనిపిస్తోంది. తమిళనాడు ఏరియాలో కాస్త రెస్పాన్స్ తక్కువ ఉంది కానీ లేకపోతే ‘RRR’ మూవీ రికార్డును తుడిచి పెట్టి, మొదటి రోజే రూ.250 కోట్లు వసూళ్లు ఈజీగా రాబట్టేది.. ఈ మధ్యకాలంలో ఏ భారతీయ సినిమా కూడా తొలి రోజు రూ.200 కోట్లు అందుకోలేదు.

Kalki Ticke Booking issue : ప్రభాస్ ‘కల్కి’ అనుకుని, రాజశేఖర్ ‘కల్కి’ టికెట్లు బుక్ చేసుకున్నారు..

ఒకవేళ ‘కల్కి’ సినిమాకి కోలీవుడ్ నుంచి సరైన రియాక్షన్ రాకపోతే, ఇకపై తెలుగులో రిలీజ్ అయ్యే తమిళ్ డబ్బింగ్ సినిమాలపైన ఆ రియాక్షన్ కనిపించవచ్చు.. గత నాలుగు నెలల్లో తెలుగులో ఏ తెలుగు సినిమా పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేదు. కానీ రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో మంచి లాభాలు వచ్చాయి. తమన్నా ‘బాక్’, విజయ్ సేతుపతి ‘మహారాజ’ సినిమాలు ఇక్కడ బాగా ఆడాయి. తెలుగు సినిమాలను మాత్రం తమిళ్ ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post