Kakarakaya Nilva Pachchadi : కాకర ఈ పేరు వినగానే అందరికీ వెంటనే చేదు గుర్తొస్తుంది. దీంతో కాకరకాయను తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ కాకరకాయ ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారకి దివ్యౌషధం.
కాకరతో పులుసు, కూర, వేపుడు వంటి రకరకాల పదార్ధాలను తయారు చేస్తారు. ఇవే కాకుండా కాకరకాయతో నిల్వ పచ్చడి కూడా చేయొచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడంతో పాటు 6 నెలలు నిల్వ ఉంటుంది. కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
Drinking Water : నీళ్లు తాగడం ఒక ఆర్ట్..
కావాల్సిన పదార్థాలు:
* కాకరకాయలు 1/2 కేజీ
* చింతపండు 50 గ్రాములు
* వేరుశనగ నూనె 1/2 కేజీ
* కారం 50 గ్రాములు
* ఉప్పు 50 గ్రాములు
* మెంతుపొడి రెండు టేబుల్ స్పూన్లు
* ఆవాల పొడి రెండు టేబుల్ స్పూన్లు
* పసుపు చిటికెడు
* అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్
* ఎండు మిరపకాయలు నాలుగు
* కరివేపాకు రెండు రెమ్మలు
* ఆవాలు జీలకర్ర కలిపి ఒక టేబుల్ స్పూన్
* ఒక్క వెల్లుల్లిపాయ రెమ్మలు
తయారీ విధానం :
ముందుగా కాకరకాయల్ని పైనున్న చెక్కు గీసేసి, కడిగి రౌండ్ గా మొక్కలు కోసుకొని పూర్తిగా తడి లేకుండా ఆరనివ్వాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు అన్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి తీసేసి అదే నూనెలో, ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి.
అవి దోరగా వేగిన తర్వాత చింతపండు నానబెట్టి దాని నుండి తీసిన గుజ్జుని వేసి అందులోనే చిటికెడు పసుపు కూడా వేసి ఆయిల్ పైకి తేలేంతవరకు కలుపుతూ ఉండాలి. ఆ మిశ్రమం బాగా దగ్గరపడి ఆయిల్ పైకి తేలిన తర్వాత దాని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో.. కారం, ఉప్పు మెంతుపొడి ఆవాల పొడి వేసి కలుపుకోవాలి.
Vishwa Hindu Parishath : సీతతో అక్బర్ని ఎలా జోడి కడతారు! కోర్టుకెక్కిన విశ్వ హిందూ పరిషత్..
ఆ తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఆరు నెలల పాటు నిల్వ ఉండే కాకరకాయ ఆవకాయ రెడీ అవుతోంది ఇది ఫ్రిజ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఆరు నెలల పాటు బయట కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది.