Janasena Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మారిపోతున్న పరిస్థులను చూస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. 2029 కి పవన్ కళ్యాణ్ బలపడితే ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంటుంది.
పవన్ కళ్యాణ్ ప్రజల్లో తనకున్న ఇమేజ్, నమ్మకం, సామాజిక సేవలతో మంచి పేరును సంపాదించారు. JSP కి బలపడే అవకాశాలు ఉంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ ఇవ్వవచ్చు. యువతలో పవన్ కి ఉన్న క్రేజ్, కొత్త రాజకీయ నాయకులు రావాలనే భావన, జనసేనకు కలిసొచ్చే అంశాలు.
2029లో రాజకీయ కారణాలు ఏవైనా అప్పటి పరిస్థితుల్లో మార్పులకు దారి తీయవచ్చు.. ఆ మార్పులు అనేక అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ పనితీరు, ప్రజాభిప్రాయం, ఆర్ధిక పరిస్థితులు, పార్టీలు ప్రజలతో ఎలా కమ్యూనికేట్ చేస్తాయి అన్నదీ కీలకం. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషిని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు.
అయితే TDP నేతల దగ్గరనుంచి, కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. అయితే పవన్ కళ్యాణ్ ను మించి ప్రజలకు అందుబాటులో ఉండటం నిజంగా పెద్ద టాస్క్. ఈ టాస్క్ మీద TDP భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
Sr NTR : దేవుడిగా బతికి, ఒంటరిగా విడిచి.. ఎన్టీఆర్ ఆ తప్పు చేయకపోయి ఉంటే..
ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కి, వారి TDP అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కొత్త సవాలుగా మారుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని ‘చంద్రబాబు’ కన్న కలల కోసం టీడీపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి.
మొత్తానికి, పవన్ కళ్యాణ్ బలపడితే, టీడీపీ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని టీడీపీ చూస్తుంటే, JSPతో వ్యతిరేకంగా పోరాటం చేయడం తప్పని సరి లేదా వ్యూహాత్మకంగా పొత్తులు పెట్టుకోవడం పెట్టుకోవాలి. ఏదేమైనా లోకేష్ రాజకీయ భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, ఈ రాజకీయ వ్యవహార వ్యూహాలు, ప్రజల మనోభావాలదే కీలక పాత్ర.