Jagan Furniture : 2019లో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జగన్, ప్రమాణ స్వీకారం తర్వాత అభివృద్ధి మీద కాకుండా ప్రతిపక్షం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రజా వేదికని సీఎం ఆఫీస్ కింద వినియోగిస్తామని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు లేఖ రాసిన కూడా దాన్ని పట్టించుకోకుండా దాన్ని కూల్చివేయించారు. 2014లో శాసన సభ స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్‌ని, జగన్ సర్కార్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.
అధికారం పోయిన వెంటనే కోడెల, తన దగ్గరున్న ఫర్నిచర్‌ని స్వాధీనం చేస్తానని చెప్పారు. ఆరోజు అసలు తన దగ్గర ఫర్నిచర్ ఉందని కోడెల చెప్పకపోతే ఆ విషయం ఎవరికీ తెలిసేది కూడా కాదు. జగన్ మొండి వైఖరి తెలియని కోడెల మర్యాద పూర్వకంగానే వస్తువుల్ని స్వాధీనపరుచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జగన్ ప్రభుత్వానికి 2019 ఆగస్ట్ 7న, 20న అప్పటి అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్‌కి లేఖలు రాశారు.
Brother Anil – YS Jagan : జగన్ జైలులో ఉంటే షర్మిల పాదయాత్ర చేసింది! అధికారం రాగానే దూరం పెట్టారు..
తన దగ్గర 2 లక్షల రూపాయిలు విలువ చేసే ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది, వాటిని తీసుకెళ్లండి లేదా వాటి విలువ చెప్తే డబ్బులు చెల్లిస్తానని ఆయన లేఖ రాశారు. ఇది జరిగిన 15 రోజుల తర్వాత ఆగష్ట్ 22న కోడెల, ప్రభుత్వ ఫర్నిచర్ ఇవ్వకుండా ఉంచేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కంప్లైంట్ చేశాడు! ఆ తర్వాతి రోజే ఆగస్ట్ 24న కోడెల మీద FIR నమోదు చేసి, 409 సెక్షన్ కింద అంటే పదేళ్లు శిక్ష పడే సెక్షన్ కింద కేసు పెట్టారు.
2024 అసెంబ్లీ ఎలక్షన్‌లో జగన్ ఘోర పరాజయం చవి చూసిన తర్వాత సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.. 2019 నుంచి 2024 వరకు తన సొంత నివాసాలు ఆయిన తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్ ఇళ్ల రిపేర్లకి రూ.46 కోట్ల వరకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టాడు. అందులో కొన్ని కోట్లు తన ఇంట్లోనే సిఎంవో కింద ఖర్చు పెట్టాడు.
ఫర్నిచర్‌ని తీసుకు వెళ్ళండి, లేకపోతే డబ్బు అయినా జమ చేసుకోండని కోడెల లేఖలు రాసినా, కేవలం కక్ష సాధింపు చర్యతో ఆయన మీద పదేళ్లకు తగ్గకుండా కేసులు పెట్టించారు. జగన్ చర్యల వల్లే ఆత్మాభిమానంతో ప్రాణ త్యాగం చేసుకున్నారు కోడెల. ఆయన ఉసురు తీసిన పాపం జగన్ సర్కార్‌దేనని అప్పుడు ప్రతిపక్షం ఆరోపించింది..
ఆయన మీద కేవలం 2 లక్షల రూపాయిల ఖరీదైన ఫర్నిచర్ కోసం దొంగతనం నేరం మోపితే, ఇప్పుడు జగన్ సీఎంవో కింద చేసింది ఏమిటి? ప్రభుత్వ సొమ్ముతో ఫర్నిచర్, ఇతరత్రా వస్తువులు, సొంత విలాసాల కోసం కొనుగోలు చేయటం దొంగతనం కాదా?