Nani Saripodhaa Sanivaaram : ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ మూవీని ఫినిష్ చేస్తున్న నాని, తన తర్వాతి మూవీగా ‘సరిపోదా శనివారం’ మూవీని అనౌన్స్ చేశాడు. ‘అంటే సుందరానికి’ దర్శకుడు వివేక్ ఆత్రేయ, ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీలో కోలీవుడ్ డైరెక్టర్ సూర్య విలన్‌గా నటిస్తుంటే, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవలో తలదూరుస్తున్న అమెరికా.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..
అనౌన్స్‌మెంట్ రోజునే టీజర్ కూడా రిలీజ్ చేసింది ‘సరిపోదా శనివారం’ చిత్ర యూనిట్. అయితే ఈ మూవీ, మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన సైకో కిల్లర్ నవల ‘శనివారం నాది’ కథకు కాపీ అంటున్నారు కొందరు నవలా ప్రియులు. శనివారం వచ్చే శక్తులతో హీరో, నగరంలో అరాచకాలు సృష్టిస్తున్నవారి పని పడుతూ ఉంటాడు. టీజర్‌లోనే ఈ కాన్సెప్ట్, జనాలకు బాగా అర్థమైంది.
అయితే ఇది ‘శనివారం నాది’ నవలలోని పాయింటే. ‘శనివారం నాది’ నవల మూడోసారి రీప్రింట్ అయ్యి, కొన్ని గంటల్లోనే అమ్ముడైపోయింది. అంత డిమాండ్ ఉన్న నవలలో ఉన్న సీన్స్‌ని మక్కీకి మక్కీ ‘సరిపోదా శనివారం’ టీజర్‌లో దింపేశాడు వివేక్ ఆత్రేయ. దీంతో చాలా మంది వివేక్ ఆత్రేయ, ‘శనివారం నాది’ నవలను ‘సరిపోదా శనివారం’ అని పేరు మార్చి సినిమాగా తీస్తున్నాడా? అని అనుమానిస్తున్నారు..
ఫేక్ వీడియోలు చేయడం కూడా నేరమే! రష్మిక వీడియోపై మొదలైన రచ్చ..
నవలలు సినిమాలుగా మారడం తెలుగులో ఎప్పటి నుంచో ఉంది. తివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర్నుంచి చాలా మంది దర్శకులు, ఫేమస్ నవలలను సినిమాలుగా తీసి సక్సెస్ కొట్టారు కూడా. మరి వివేక్ ఆత్రేయ, మల్లాది దగ్గర కాపీ రైట్స్ తీసుకుని సినిమా చేస్తున్నాడా? లేక కథలో మార్పులు చేసి, తన క్రియేటివిటీని జోడించి తీస్తున్నాడా? అనేది తెలియాలంటే మాత్రం మూవీ రిలీజ్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే..
‘టైగర్’ ఫ్లాప్! ‘ఈగల్’ విషయంలో ఇగోలకు పోయి, రవితేజ మళ్లీ తప్పు చేస్తున్నాడా..