IPL 2024 Winner : ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2024 సీజన్ టైటిల్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఆదివారం చెన్నైలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది కోల్‌కతా. హైదరాబాద్ బ్యాటర్లు 113 పరుగులకే కుప్పకూలారు. ఈ లక్ష్యాన్ని 57 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ విజయంతో కోల్‌కతా ఖాతాలో 3వ టైటిల్ చేరింది. ఇంతకుముందు 2012, 2014 సీజన్లలో ఐపిఎల్ టైటిల్స్ గెలిచింది కోల్‌కత్తా నైట్ రైడర్స్.. ఫైనల్ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ సీజన్‌లో 741 పరుగులు చేసిన RCB బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఈ సీజన్‌లో 24 వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ హర్షల్ పటేల్, పర్పుల్ క్యాప్ గెలిచాడు. ఈ సీజన్‌లో 488 పరుగులు, 17 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ చూపించిన కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్‌కి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు దక్కింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి రన్నరప్ టైటిల్‌తో పాటు ఫెయిర్ ప్లే అవార్డు కూడా దక్కింది. తెలుగు కుర్రాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కింది.
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్, ఐపీఎల్ 2024 టైటిల్ విజేతగా నిలిచింది. గౌతమ్ గంభీర్, ఈ సీజన్‌లో ఆ జట్టుకి మెంటర్‌గా రావడం, మొదటి సీజన్‌లోనే ఆ జట్టుకి టైటిల్ అందించడం విశేషం.
IPL 2024 : తప్పుకున్న ధోనీ.. కుర్రాళ్ళ మధ్యే పోటీ..