Indian Students in Abroad : ఫారిన్‌లో పైచదువులు చదవడం అంటే చాలా పెద్ద అఛీవ్‌మెంట్.. ఇక్కడ ఎన్ని యూనివర్సిటీలు, కాలేజీలు ఉన్నా.. ఎంబీఏ, మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్తున్నారు చాలా మంది విద్యార్థులు. సిటీ దాటడానికే బడ్జెట్ గురించి ఆలోచించే దిగువ మధ్య తరగతి వాళ్ల సంగతి పక్కనబెడితే, ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది డిగ్రీ, బిటెక్ కాగానే ఫ్లైట్ ఎక్కి, పై చదువుల కోసం విదేశాలకు చెక్కేసేవాళ్లే ఎక్కువ. ఇక్కడి కంటే అక్కడ చదివితే మెరుగైన జీతం, ఉద్యోగావకాశాలు, లైఫ్ స్టైల్ బాగుంటుందనే ఆశే.. కన్నవారికి, ఉన్న ఊరిని విడవడానికి కారణం.
Samantha : అతన్ని గుడ్డిగా నమ్మి, మోసపోయా! సమంత కామెంట్స్ ఎవరి గురించి…?
అయితే ఇలా విదేశాలకు వెళ్లిన వారిలో కొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుండడం, విద్యార్థుల కుటుంబాలను కలవరపెడుతోంది. 2019 నుంచి గత నాలుగేళ్లలోనే విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్స్ కారణంగా కొందరు చనిపోతే, దోపిడికి గురై కొందరు, జాతి వివక్ష దాడులతో మరికొందరు ప్రాణాలు విడిచారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడలేక, తిరిగి వస్తానని తల్లిదండ్రులను ఒప్పించలేక ఇంకొందరు విగత జీవులుగా మారారు. ఇలా ఒక్క కెనడాలోనే 91 మంది భారతీయ విద్యార్థులు చనిపోయారు. లండన్‌లోనూ గత నాలుగేళ్లలో 50 మంది వివిధ కారణాలతో చనిపోయారు.
మునుపటితో పోలిస్తే, ఇండియాలో విద్యా ప్రమాణాలు చాలా మెరుగయ్యాయి. ఇంకా చెప్పాలంటే విదేశాల నుంచి చాలామంది విద్యార్థులు, ఇక్కడికి చదువుకోవడానికి వస్తున్నారు. అయితే ఇక్కడ పోటీని తట్టుకోలేమని, రూపాయి కంటే డాలర్‌కి విలువ ఎక్కువని అత్యాశతో దేశం దాటుతున్న వారు, అక్కడ అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు.. వీరిలో చాలామందికి విదేశాలకు వెళ్లడం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద వెళ్తున్నవాళ్లు కూడా ఉండడం కొసమెరుపు..
Modi vs Advani : అప్పుడలా.. ఇప్పుడిలా.. మోదీ కపట ప్రేమ..