Indian 2 Movie : అసలు కథంతా భారతీయుడు 3లోనే!

Indian 2 Movie
Indian 2 Movie

Indian 2 Movie : డైరెక్టర్ శంకర్, కొంత గ్యాప్ తీసుకుని కమల్ హాసన్‌తో కలిసి చేసిన సినిమా ‘భారతీయుడు 2’. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ ఇది. ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి ఎన్నో ఆటంకాలు, దానికి మించి ఇబ్బందులు వచ్చాయి. మొత్తానికి ఎలాగోలా సినిమాని పూర్తి చేసి, జూలై 12న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు..

ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో తెగ బిజీగా ఉన్నారు శంకర్, కమల్ హాసన్. ‘భారతీయుడు 2 సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ కాదు. నాకు ఇదేమీ పెద్దగా నచ్చలేదు. అయితే భారతీయుడు 3 సినిమా నాకు బాగా నచ్చింది. అసలు మజా అంతా అందులోనే ఉంటుంది. ఆ సినిమా కోసమే ఎదురుచూస్తున్నా.. భారతీయుడు 2 వచ్చిన 6 నెలలకు పార్ట్ 3 విడుదల చేస్తాం.. థియేటర్లలో ఆ సినిమా చూసేందుకు నేను ఆతృతగా ఉన్నా..’ అంటూ కామెంట్ చేశాడు కమల్ హాసన్..

Indian 2 Trailer : కనిపించని శంకర్ మార్క్! ఏదో మొక్కుబడిగా చేశాడా..

కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు ‘భారతీయుడు 2’ సినిమాపై నెగిటివ్ టాక్ తెచ్చేలా ఉన్నాయి. అసలు ‘భారతీయుడు 2’ చూడకండి, అందులో ఏం లేదు.. 6 నెలల తర్వాత వచ్చే ‘భారతీయుడు 3’ చూడండి అని డైరెక్టుగా చెప్పేస్తున్నట్టే ఉన్నాయని సినీ ఫ్యాన్స్ అభిప్రాయం. ఇప్పటికే ‘భారతీయుడు 3’ షూటింగ్ కూడా అయిపోయింది. ‘భారతీయుడు 2’ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ సినిమాని పూర్తి చేసి, ‘భారతీయుడు 3’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెడతాడు శంకర్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post