Ind vs Pak : ఇండియ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే బాక్సాఫీస్ బొనాంజానే. రెండు జట్లు కాదు, రెండు దేశాల మధ్యే మ్యాచ్ జరిగినట్టు ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇలాగే సాగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లలో 119 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రిషబ్ పంత్ 42, అక్షర్ పటేల్ 20 తప్ప మిగిలిన బ్యాటర్లు అందరూ ఫెయిల్ అయ్యారు. 120 బంతుల్లో 120 కొట్టాలి!
ఇంకేముందిలే పాకిస్తాన్ ఈజీగా గెలుస్తుందని చాలా మంది టీవీలు, మొబైల్ ఫోన్లు కట్టేసి పడుకున్నారు. అయితే భారత బౌలర్లు అంత ఈజీగా వదల్లేదు. బూమ్ బూమ్ బుమ్రా 3 వికెట్లు తీసి మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. హార్ధిక్ పాండ్యా నేనున్నానంటూ 2 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ తీసింది ఒక్క వికెటే అయినా ఆఖరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటర్లు ఫెయిలైనా బౌలర్ల పంతానికి పాకిస్తాన్ 113 పరుగులే చేయగలిగింది. 6 పరుగుల తేడాతో టీమిండియాకి గెలుపు దక్కింది.
Tollywood Heros Tags : హీరోలకు ‘స్టార్’ ట్యాగ్‌ల పిచ్చి.. ఆఖరికి శర్వానంద్ కూడా తగిలించుకున్నాడుగా..
టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది అతి తక్కువ టార్గెట్‌ని అందుకున్న అతిపెద్ద విజయం. అంతేకాదు భారత బ్యాటర్లు ఆలౌట్ అయిపోయాక భారత జట్టు, ఓ టీ20 మ్యాచ్ గెలవడం కూడా ఇదే తొలిపారి.. 3 వికెట్లు తీసి మ్యాచ్‌ని మలుపు తిప్పిన బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మొదటి మ్యాచ్‌లో USA చేతుల్లో ఓడిన పాకిస్తాన్, వరుసగా రెండో ఓటమి అందుకుంది. దీంతో సూపర్ 8కి చేరడం కష్టమే.