Ind vs NZ: భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో విజయం అందుకుంది టీమిండియా. 2015, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఫైనల్ చేరి, రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు.. ఈసారి సెమీ ఫైనల్ నుంచే ఇంటి దారి పట్టింది..
ముంబైలో ‘మాస్టర్’ రికార్డులు బ్రేక్..
న్యూజిలాండ్ బ్యాటర్ డార్ల్ మిచెల్ 134 పరుగులు చేయగా కేన్ విలియంసన్ 69, గ్లెన్ ఫిలిప్స్ 41 పరుగులు చేశారు. ఈ ముగ్గురి పోరాటం కారణంగా 300+ మార్కు దాటి పోరాడగలిగింది న్యూజిలాండ్..
Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..
భారత బౌలర్లలో మహ్మద్ షమీ 7 వికెట్లు తీయగా జస్ప్రిత్ బుమ్రాకి ఓ వికెట్ దక్కింది. ఆదివారం, నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. రేపు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్‌లో గెలిచిన జట్టు, ఆదివారం టీమిండియాతో టైటిల్ ఫైట్ మ్యాచ్ ఆడుతుంది.