Hyderabad : తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మించే వరకూ 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొంది పార్లమెంట్. చట్ట ప్రకారం జూన్ 2తో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం జరిగి పదేళ్లు ముగిసింది. దీంతో రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు ముగిసింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటికీ, ఇబ్బందులు ఎదుర్కొన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే!
తొలుత ఆంధ్ర, తమిళనాడు కలిసి ఉన్న మద్రాసు రాష్ట్రానికి తొలుత చెన్నపట్టణం రాజధానిగా ఉండేది. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఆ సమయంలో కర్నూలు కొన్నాళ్లు, గుంటూరు కొన్నాళ్లు రాజధానిగా ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా మారింది.
Astrologer Venu Swamy : వైసీపీని భయపెడుతున్న వేణు స్వామి.. SRH ఓటమితో జగన్ ఓటమి ఖాయమేనా..
మళ్లీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే ఐదేళ్లకే టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో రాజధాని అమరావతి అభివృద్ధి సగంలోనే ఆగిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. ప్రతిపాదన అయితే వచ్చింది కానీ మూడింట్లో ఒక్కటి కూడా పూర్తి కాలేదు.
చివరికి ఎన్నికలు దగ్గర పడిన తర్వాత ఈసారి గెలిస్తే వైజాగ్, ఆంధ్రప్రదేశ్ రాజధాని చేస్తానంటూ చెప్పాడు వైఎస్ జగన్. మొత్తానికి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు ముగిసినా ఆంధ్రప్రదేశ్‌కి ఓ రాజధాని లేకపోవడం చరిత్రలో అతిపెద్ద పాలనా వైఫల్యంగా మిగిలిపోనుంది.
తెలంగాణ పోరు! రాష్ట్రం వచ్చి దశాబ్దం దాటినా మా రాతలు మారలేదు దొరా..!