Hitchki Movie : రాణి ముఖర్జీ ‘హిచ్కీ’ మూవీ రివ్యూ..

Hitchki Movie :

Casting : Rani Mukerji, Supriya Pilgaonkar, Harsh Mayar Etc..
Director : Siddharth P. Malhotra
Producer : Aditya Chopra, Maneesh Sharma
Language : Hindi
Release date : 23 March 2018
OTT Platform : Amazon Prime

రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఓ సందేశాత్మక చిత్రం “హిచ్కీ”. ఈ చిత్రంలో రాణి ముఖర్జీ ‘నైనా మాథూరి’ అనే పాత్రలో జీవించేశారు. నైనా.. టూరెట్ అనే సిండ్రోమ్ తో (మెదడులోని నరాల బలహీనత వల్ల వచ్చే ఒక వ్యాధి) బాధపడుతుంది. దీని ప్రభావంతో శరీరానికి షాక్ తగిలినట్లుగా అయి అసంకల్పితంగా చక్.. చక్.. వా.. వా.. అనే వింత శబ్ధం వస్తుంది. దీంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఎగతాళి చేసేవారు.

ఆమె వలన ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది అనే కారణంతో నైనాను స్కూల్ లో చేర్చుకునేవారు కాదు. ఈ సమస్య వలన నైనా 12 స్కూల్స్ మారాల్సి వచ్చింది. చదువుకునే రోజుల్లోనే తనని అన్ని స్కూల్స్ నుంచి పంపించారు అంటే.. తనే ఒక స్కూల్ టీచర్ అవ్వాలంటే ఇంకెన్ని స్కూల్స్ తిరగాలో..!??

Bollywood : బాలీవుడ్‌ పనైపోయిందా..!?

టూరెట్ సిండ్రోమ్ ని కారణంగా చూపి ఎన్నో స్కూల్స్ తన అప్లికేషన్ ను రిజెక్ట్ చేశాయి. కొందరైతే ఆ ఉద్యోగానికే నువ్వు పనికి రావు అంటూ అవమానించే వారు కానీ, నైనా పట్టువదల లేదు. దాదాపు 5 సంవత్సరాలకు పైగా ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరకు తను చదివిన సెయింట్ నోట్కార్ స్కూల్లో 9F విద్యార్థులకు బోధించే అవకాశం వచ్చింది.
ఆ 9F లో ఉండే విద్యార్థులు స్కూల్ మొత్తానికి తలనొప్పి లాంటి వారు.

ఆ క్లాస్ కి వచ్చిన ఏ టీచర్ అయినా కొన్నాళ్ళకే రిజైన్ చేసి వెళ్లిపోయేవారు. ఇలాంటి పరిస్థితుల్లో 9F తరగతిలో ప్రవేశించిన నైనా టీచర్ ఎన్నాళ్ళు ఉన్నారు.. ఆ విద్యార్థులు టీచర్ తో ఎలా ఆడుకున్నారు.. ఆ టీచర్ స్టూడెంట్స్ కి ఏం నేర్పించింది, ఎలా నేర్పించిందో తెలియాలంటే మాత్రం హిచ్కీ చూడాల్సిందే.

Bollywood Powerhouse RGV :బాలీవుడ్‌ని ఏలింది ఓ తెలుగోడు! ఆర్జీవీ వల్లే ఈ పొజిషన్‌లో ఉన్నాం..

“ఒక సాధారణ ఉపాధ్యాయుడు పాఠం చెప్తాడు, ఓ మంచి ఉపాధ్యాయుడు వివరిస్తాడు, ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు, అత్యుత్తమ ఉపాధ్యాయుడు స్ఫూర్తినిస్తాడు” అన్న మాటలే ఈ సినిమాకి స్ఫూర్తి అనుకుంటా. Bad Students ఉండరు, Bad Teachers మాత్రమే ఉంటారు అనే మాటలు మనల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఒక సినిమా చూశాక మళ్లీ అదే సినిమాని కొన్నాళ్లకు చూడాలంటే చాలా బోర్ గా ఫీల్ అవుతాం కానీ ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అదే హిచ్కీ మూవీ మహాత్యం. ఇంకా ఈ మూవీ చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది మిస్ అవ్వకుండా చూడండి.

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post