Free Bus Travel Scheme : తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం, రాష్ట్రంలో సజావుగా అమలు అవుతోంది. రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ పథకం అమలులోకి వచ్చి 50 రోజులు పూర్తి అయ్యింది. ఈ 50 రోజుల్లో 12 కోట్ల మంది మహిళలు, ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకున్నారు..
Tapsee pannu : యానిమల్’ లాంటి సినిమాల్లో నేనైతే నటించను
రోజుకి 10 లక్షల మందికి పైగా మహిళలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగింది. సీట్ల కోసం మహిళలు కొట్టుకునే సన్నివేశాలు, సోషల్ మీడియాలో ప్రత్యేక్షం అవుతున్నాయి. ఫ్రీ కావడంతో కేవలం ఛాయ్ తాగడానికి వందల కిలో మీటర్లు బస్సుల్లో ప్రయాణిస్తున్న ఆడవాళ్ల కథనాలు బయటికి వచ్చాయి, వస్తున్నాయి.
ఈ 50 రోజుల్లో ఈ ఫ్రీ బస్సు పథకం కారణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఆర్‌ఆర్‌టీసీ)కి వచ్చిన నష్టం అక్షరాల 600 కోట్ల రూపాయలు. సంక్రాంతికి గ్రామాలకి వెళ్లే జనాల సంఖ్య విపరీతంగా ఉంటుంది. అందుకే ఈ పండగకు స్పెషల్ బస్సులు పెట్టి, టికెట్ ధరలు పెంచి, లాభాలు పెంచుకునేది ఆర్టీసీ. అయితే ఫ్రీ బస్సు పథకం కారణంగా ఆ అవకాశం కూడా పోయింది… మొత్తంగా రెండు నెలల్లోనే ఈ పథకం కారణంగా ఆర్టీసీ రూ.700 కోట్ల వరకూ నష్టం వచ్చిందట..
TSRTC free bus Effect : ఫ్రీ బస్సు తెచ్చిన తంటా.. 3 రోజులుగా తిండి తిప్పలు మానేసి..