Free Bus Effect : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్ పథకం కారణంగా ఆటో డ్రైవర్లు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. అలాగే ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులకు కూడా భారీగా డిమాండ్ పడిపోయింది. తాజాగా హైదరాబాద్ మెట్రోపై కూడా ఈ ప్రభావం పడినట్టుగా ఎల్ అండ్ టీ సంస్థ డైరెక్టర్ శంకర్ రమన్ తెలియచేశాడు.
‘ఫ్రీ బస్ పథకం కారణంగా మెట్రోలో ఎక్కే మహిళా ప్రయాణీకుల సంఖ్య భారీగా తగ్గింది. మహిళలు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తుండడంతో మెట్రో ఎక్కే ఉద్యోగుల సంఖ్యపై ప్రభావం చూపించింది. పురుషులు మెట్రో వాడుతున్నారు. కానీ సగటున వారి నుంచి వచ్చే ఆదాయం 35 రూపాయలు మాత్రమే.
Revanth Reddy : నేను శిష్యుడిని కాదు, ఆయన నా గురువు కాదు..
‘కొన్నిసార్లు రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చిన హామీలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయొచ్చు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం వల్ల రాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ దివాళా తీసే పరిస్థితికి చేరుకుంటుంది. 2026-2031 మధ్య మెట్రోను వేరే సంస్థను అప్పగించాలని చూస్తున్నాం..’ అంటూ చెప్పుకొచ్చాడు ఎల్ అండ్ టీ సంస్థ డైరెక్టర్ శంకర్ రమన్.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రెడ్ లైన్, గ్రీన్ లైన్, బ్లూ లైన్ అని మూడు దారుల్లో నడుస్తోంది. పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ మధ్య నడిచే గ్రీన్ లైన్ దాదాపు ఖాళీగా నడుస్తోంది. 9 స్టేషన్లు ఉండే ఈ లైన్‌లో ప్రయాణీకుల రద్దీని పెంచేందుకు రూ.15 ఛార్జీ మాత్రమే పెట్టినా కూడా ఈ లైన్‌కి సరైన ఆదరణ దక్కడం లేదు..