సంక్రాంతి రేసు నుంచి ‘ఫ్యామిలీ స్టార్’ అవుట్… విజయ్ దేవరకొండ మూవీ వాయిదా పడనుందా..?

Vijay Deverakonda

Vijay Deverakonda:2024 సంక్రాంతికి మొత్తంగా 8 పెద్ద సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీతో పాటు నాగార్జున ‘నా సామి రంగ’, వెంకటేశ్ ‘సైంధవ్’, తేజ సజ్జ ‘హనుమాన్’, రవితేజ ‘ఈగల్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివకార్తికేయన్ ‘అయాలన్’ మూవీస్‌తో పాటు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ కూడా సంక్రాంతి రేసులో నిలిచింది.

మెనుస్ట్రువల్ కప్ ఎవరు వాడాలి, ఎలా వాడాలి, లాభనష్టాలేంటంటే..

అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా 30 శాతం వరకూ మిగిలి ఉందని టాక్. సంక్రాంతికి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ లోపు షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడం జరిగే పని కాదు. అదీకాకుండా ఏకంగా 8 సినిమాలు ఒకేసారి విడుదల అయితే టాక్ తేడా కొడితే
వసూళ్లపై తీవ్రంగా ప్రభావం పడుతుంది.
Vijay Deverakonda
అందుకే దిల్ రాజు కూడా సంక్రాంతి రేసు నుంచి పక్కకు తప్పుకోవడమే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట. ‘ఖుషీ’ మూవీతో కమ్‌బ్యాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ, ఈ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో సూపర్ హిట్టు కొట్టాలని ఆశపడుతున్నాడు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండడంతో ‘ఫ్యామిలీ స్టార్’పై అంచనాలు పెరిగిపోయాయి.

మంచు లక్ష్మికి ముద్దు పెట్టిన అల్లు శిరీష్… సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఇదే..

వీలైతే వాలెంటైన్స్ డే వీక్‌లో, అది కూడా వీలు కాకపోతే మార్చి నెలలో ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలో దిగుతాడని సమాచారం. మార్చిలో పరీక్షల సీజన్ మొదలవుతుంది. విజయ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ స్టూడెంట్సే. కాబట్టి సంక్రాంతి మిస్ అయితే లేటు కాకుండా రిపబ్లిక్ డే వీక్‌లో కానీ, వాలెంటైన్స్ డే వీక్‌లో కానీ ‘ఫ్యామిలీ స్టార్’ని థియేటర్లలో దింపడం బెటర్ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post