Eat After Walking : ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యం మనం అస్సలు పట్టించుకోవట్లేదు. ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడం కోసం కాస్త సమయాన్ని కేటాయించలేకపోతున్నాము. ఆరోగ్యానికి నడక (Walking) దివ్య ఔషధంగా సాయపడుతుంది. అన్ని వ్యాయామాల కంటే తేలికైంది నడక. దీనివల్ల శరీరంలో వేగంగా కేలరీలు ఖర్చయి, శక్తి తగ్గుతుంది. అందుకే వ్యాయామం చేశాక కొన్ని పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికెంతో మేలు జరుగుతుంది. అవేంటంటే..
అరటి (Banana) : ఇది క్రీడాకారులకూ, వ్యాయామం చేసేవారికీ చాలా మంచిది. అలసిపోయినప్పుడు తక్షణ శక్తినిస్తుంది. అరటిలో ఆరోగ్యమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీన్ని ప్రత్యక్షంగా కాకుండా.. వెన్న తీసిన పాలతో కలిపి స్మూతీలా చేసుకొని అందులో కాస్త నిమ్మరసం పిండి తీసుకుంటే శరీరానికి తక్షణం శక్తి అందుతుంది.
Gutti Vankaya Kura : గుత్తి వంకాయ కూర..
సలాడ్లు (Salads) : వాకింగ్ చేసిన వారు డీహైడ్రేషన్‌కి లోనవకుండా.. తగిన నీటి శాతం అవసరం. ఆ నీటిశాతం పండ్ల రూపంలో ఎక్కువగా అందితే ఇంకా మంచిది. అందుకే ఉదయం పూట పండ్ల సలాడ్లకు ప్రాధాన్యమివ్వాలి. కమలాపండు, బత్తాయి, యాపిల్, ద్రాక్ష, పుచ్చకాయ ఎక్కువగా తీసుకోవాలి. వీటి ద్వారా శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లూ, పీచూ సమృద్ధిగా అందుతాయి.
కాయగూరలు (Vegetables) : ఉదయం పూట కాయగూరల్ని తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి (Immunity Power) పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. వ్యాయామం అనంతరం కాయగూరల శాండ్‌విచ్‌లు తీసుకుంటే మంచిది.
బాదం (Almonds) : నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. వీటిలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ.