Fried Banana : అరటిపండులోనే కాదు, పచ్చి అరటికాయలో కూడా అనేక ప్రయోజనాలున్నాయి. సాధారణంగా పచ్చి అరటికాయలను ఉడికించి, లేదా ప్రాసెస్ చేసి లేదా ఫ్రై చేసుకుని తింటుంటారు. అరటికాయ చాలా తక్కువగా వండుతూ ఉంటారు, అదికూడా కూర లేదంటే ఫ్రై. కొంతమందికైతే అది కూడా నచ్చదు. అలాంటి వారు అరటికాయ 65 ఒక్కసారి చేసి చూడండి, మొత్తం మీరే లాగించేస్తారు అంత రుచిగా ఉంటుంది మరి..
కావాల్సిన పదార్థాలు :
అరటికాయలు -2
కార్న్‌ఫ్లోర్ – 3 స్పూన్స్
మైదా: 2 చెంచాలు
నూనె – తగినంత
పెరుగు – 1 కప్పు
కారం – 1 స్పూన్
మిరియాలపొడి – 1/2 స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
కేసరి కలర్ – 1/2 స్పూన్
గ్రీన్ చిల్లీ సాస్ – 2 స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడా
పచ్చిమిర్చి – 4
కరివేపాకు – 2 రెమ్మలు
Egg Masala : ఘాటైన గుడ్డు మసాలా..
తయారీ విధానము :
ముందుగా అరటికాయల్ని తొక్క చెక్కి ముక్కలుగా కోసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి అందులో మైదా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గ్రీన్ చిల్లీసాస్, కేసరి కలర్, కొద్దిగా నీరు పోసి జారుగా కలుపుకోవాలి. గుజ్జులా తయారైన ఈ మిశ్రమాన్ని అరటికాయ ముక్కలకు పట్టించి కొద్దిసేపు ఆరనివ్వాలి.
స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి బాగా కాగాక అరటికాయ ముక్కల్ని పకోడిల మాదిరిగా వేయించాలి. వేగిన ముక్కల్ని నూనె వార్చి ఒక గిన్నె లో ఉంచుకోవాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగాక కరివేపాకు, పచ్చిమిర్చి, అరటికాయ ముక్కల్ని వేసి మళ్లీ వేయించి స్పూన్ తో మిశ్రమాన్నంతటిని కలగలిపి దించేయాలి. అంతే అరటికాయ 65 రెడీ..