Double Ismart Review : టాలీవుడ్‌లో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకడు. సింపుల్ కథకి తన మార్కు డైరెక్షన్‌ని జోడించి, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం పూరీ స్పెషాలిటీ. అయితే కొన్నాళ్లుగా పూరీ సినిమాల్లో తన మార్కు మిస్ అవుతోంది. ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత, చాలారోజుల తర్వాత తనకి హిట్టు ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీని తీసుకొచ్చాడు పూరీ జగన్నాథ్.. రామ్ పోతినేని కూడా వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. మరి ఈ మూవీతో ‘డబుల్’ కమ్‌బ్యాక్ ఇచ్చినట్టేనా..
‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి ఇది సీక్వెల్. హీరో బుర్రలోకి విలన్ మెమొరీ చిప్‌ని ఎక్కిస్తారు. విలన్‌గా మారిన హీరో, అసలైన విలన్‌ని ఎలా ఫేస్ చేశాడనేదే ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ. స్టోరీ లైన్ వినడానికి బాగున్నా, టేకింగ్‌లో మాత్రం అలా ఉండదు. సక్సెస్ కోసం విసిగెత్తిపోయిన పూరీ జగన్నాథ్, ఆ విసుగు మొత్తాన్ని ప్రేక్షకుల మీద చూపించేశాడు..
ఆలీ కామెడీ ట్రాక్ చూసిన వాళ్లకు పాత పూరీ జగన్నాథ్ కనిపించకపోగా ‘లైగర్’ ఛాయలు కనిపిస్తాయి. ‘నువ్వు ఇక మారవా’ అనే డైలాగ్ వచ్చేస్తుంది. మణిశర్మ మరోసారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో సినిమాని లేపేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి పాటలు ప్లస్ అయ్యి, బీ, సీ సెంటర్లలో మంచి వసూళ్లు వచ్చాయి. అయితే ఈసారి పాటలు బాగున్నా, కథ కానీ, ట్విస్టుల కోసం రాసుకున్న మదర్ సెంటిమెంట్ కానీ సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో ‘డబుల్ ఇస్మార్ట్’ మాస్ ఆడియెన్స్‌కి కనెక్ట్ కావడం కూడా కష్టమే..