Deputy CM Pawan Kalyan : ఏపీ ఉప-ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొణిదెల పవన్ కళ్యాణ్, సమస్యల పరిష్కారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా 9 నెలల కిందట కనిపించకుండా ఓ మైనర్ మిస్సింగ్ కేసు విషయంలో స్వయంగా రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్..
భీమవరం ప్రాంతానికి చెందిన శివ కుమారి కూతురు, పైచదువుల కోసం విజయవాడలో ఉంటోంది. అయితే 9 నెలల కిందటి నుంచి తన కూతురి ఆచూకీ తెలియడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిసి, తన ఆవేదన తెలియచేసింది శివ కుమారి. ప్రేమ పేరుతో తన కూతుర్ని ట్రాప్ చేసిన వాళ్లు, ఆమెని కిడ్నాప్ చేసి ఉంటారని, దయచేసి ఆమె జాడ తెలియచేయాలని కన్నీళ్లతో వేడుకుంది.
Deputy CM Pawan Kalyan : బాలకృష్ణకు నచ్చడం లేదా..
విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వెంటనే మైనర్ మిస్సింగ్ కేసుకి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీని పరిశీలించారు. మాచవరం ఏరియా సీఐకి ఫోన్ చేసి, కేసు పురోగతి వివరాలను తెలుసుకున్నారు. వెంటనే ఆ మైనర్ ప్రస్తుతం ఎక్కడుంది? ఏం చేస్తుంది? ఆమెకు సంబంధించిన వివరాలను వీలైనంత త్వరగా తెలియచేయాలని ఆదేశించారు. బాధితురాలిని, జనసేన పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్‌కి పంపించారు పవన్ కళ్యాణ్..
https://x.com/JanaSenaParty/status/1804496877179883575?t=lvfJXodmwyIpWdno94O_JA&s=19