Children Mobile Addiction : టెక్నాలజీ పెరిగిందని సంతోష పడాలో.. దాని వల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి. ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఇప్పుడు మొబైల్ తప్పని సరి. అది లేందే పూట గడవని పరిస్థితి. అయితే ఏదైనా ఒక సమస్య మొదలైందంటే దానికి కారణం కూడా మనమే. సాధారణంగా ఎవరైనా ఎదగాలి అనుకుంటారు.. అని అంటూ ఉంటారు. కానీ మన ఎదుగుదల.. మన పతనానికి కారణం అవుతాయిని ప్రూవ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఫేక్ వీడియోలు చేయడం కూడా నేరమే! రష్మిక వీడియోపై మొదలైన రచ్చ..
కొన్ని పరిశోధనల్లో ధన, మాన, ప్రాణాలు పోయాయి, పోతున్నాయి అంటే.. Tecnology అనేది మొదట Crimeని పెంచి పోషిస్తుంది. కొన్ని సందర్భాల్లో క్రైమ్ లు మొబైల్ వల్లనే మొబైల్ కోసమే జరిగాయి.
అసలు మీ పిల్లలో, మీ మనవలలో ఫోన్ వాడటానికి కారణాలు ఏంటో మీరు చెప్పగలరా..
నేను చెప్తాను.. మొదటిది ‘పిల్లలు అన్నం తినడం అనే టాస్క్ తల్లులకి తలకు మించిన భారం’.
కారణాలు లేకోపోలేదు.. చిన్న పిల్లలు కదా అని.. చాక్లెట్స్, బిస్కెట్స్, జామ్ లు, జెల్లీలు, అసలు చిప్స్, కూల్ డ్రింక్స్ కొని పెట్టడం అనేది అందరికీ అలవాటైన మర్యాదపూర్వకంగా చేస్తున్న తప్పు. అవి పెట్టడం వలన వాటి తాలూకు పదార్థం పేగులకు అంటుకుని మలం పూర్తిగా రాకపోవడం వలన ఆకలి తగ్గుతుంది. దీంతో కడుపులో పురుగులు పెరిగి ఆరోగ్యం చెడిపోతుంది.
స్వాతి చెప్పినట్టుగా ‘month of madhu’ మూవీలో నిజంగా అంతుందా?
ఇవన్నీ ఆలోచించలేని తల్లి.. బిడ్డ కడుపు నిండా తింటే చాలని మొబైల్ చేతికి ఇచ్చి వీడియో ప్లే చేసి అది ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, ఆ పిచ్చితల్లి Mobile వాడుతున్న పిల్లలను చూసి మురిసిపోతుంది. అదిగో అదే మొదట మెట్టు.. ఆ తర్వాత పిల్లలు తొక్కే అడ్డదారి ఫోన్ ఇవ్వకపోతే కిందపడి దొర్లిదొర్లి ఏడవటం. వాళ్ళ ఏడుపును చూడలేక నలుగురిలో పరువు పోవడం ఇష్టం లేక వాళ్ళు అడిగినప్పుల్లా మొబైల్ ఇవ్వడం అలవాటైపోతుంది.
రెండు ఒంటరితనం : మన చిన్నప్పుడు అని తలుచుకోగానే.. ఎన్ని ఆటలు, ఎన్ని పాటలు ఎంతమందితో పెట్టుకున్న ముచ్చట్ల, నాయనమ్మ, తాతయ్య వాళ్ళ చిన్నప్పుడు అలా ఉండేది, ఇలా ఉండేదని చెప్పిన మాటలు అబ్బో.. అలా చెప్పుకుంటూ పోతే చాలానే గుర్తుకొస్తాయి. కానీ ఇప్పటి పిల్లలకి ఆరుబయట ఆడుకోడానికి, సాటి మనుషులతో కలవడానికి టైం, అవకాశం రెండు ఉండడం లేదు.
కారణం షరా మాములే.. పెరిగిన టీవీలు, ఫోన్ల వాడకం. సరైన సమయానికి పిల్లలను బయటకు పంపకుండా ‘గంప కింద కోడి పిల్లలను దాచినట్టు దాచుకునే ప్రయత్నం’ చేస్తున్నారు పేరెంట్స్. బయటకు వెళ్ళి ఆటలాడి దెబ్బలు తగిలించుకోవడం కన్న ఇంట్లో టీవీనో, మొబైల్ లేదా టాబ్లెట్ లోనో గేమ్ ఆడుకోవడం బెటర్ అనుకోవడమని పేరెంట్స్ భావించడం.
పిల్లలు మీతో ఉన్న కాస్తా టైం కూడా మీరు ఫోన్ చూస్తూ ఉంటే.. వాళ్లకు మాట్లాడానికి ఎవరు లేక వాళ్ళలో కలిగినా మార్పులకు, వాళ్ళు ఎదురుకుంటున్న సమస్యల పట్ల అవగాహన లేక ప్రాణాలు తీస్కుంటున్నారు.
నేను ఇండియాలో పుట్టి ఉంటే.. ప్రధాని మోదీపై అమెరికా సింగర్ మేరీ మిల్‌బెన్ షాకింగ్ కామెంట్స్..
చివరగా.. ఆవు కంచె మేస్తే.. దూడ చేను మేస్తదా’ అన్నట్టూ.. పిల్లలకు సహజంగా ఎవరైనా ఏదైనా చేస్తే చూసి నేర్చుకునే అలవాటు ఉంటుంది. మిమ్మల్ని చూసి అందులో ఏముందో మీరేం చేస్తున్నారో చూడాలనే ఆతృత కలుగుతుంది వాళ్లకు. చాలామందికి వాస్తవం అర్థం అవుతున్నా.. అందులో నుంచి బయటకు రాలేక చిన్న సమస్య అనుకున్నది పెను ప్రమాదంగా మారుతుంది.