Buddy Movie Review : అల్లు శిరీష్ హిట్టు కొట్టినట్టేనా..

Buddy Movie Review : అల్లు శిరీష్ కెరీర్‌లో ఇప్పటిదాకా 8 సినిమాలు చేశాడు. అందులో లావణ్య త్రిపాఠితో చేసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా తప్ప, మిగిలిన వన్నీ ఫ్లాపులే! ఈ సినిమా తర్వాత శిరీష్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. 2022లో ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా చేసిన అల్లు శిరీష్, రెండేళ్ల గ్యాప్ తీసుకుని, #Buddy మూవీ చేశాడు.

ఇంతకుముందు ఇదే రకమైన కాన్సెప్ట్‌తో ఆర్య హీరోగా ‘టెడ్డీ’అనే సినిమా వచ్చింది. హీరోకి ఓ టెడ్డీ బేర్ కలుస్తుంది. ఆ టెడ్డీ బేర్‌ మాట్లాడడం, నడవడం చూసి హీరో షాక్ అవుతాడు. ఆ టెడ్డీ ఎలా మాట్లాడగలుగుతోంది? దానికి వచ్చిన సమస్యలు ఏంటి? ఆ సమస్యలతో హీరోతో కలిసి ఎలా ఎదుర్కొంది.. ఇదే సింపుల్‌గా టెడ్డీ మూవీ కథ..

టెడ్డీ బేర్ మిషన్ గన్‌లతో ఫైట్ చేయడం వంటి సీన్స్, చిన్న పిల్లలకు బాగా నచ్చుతాయి. ‘టెడ్డీ’కి, ఇప్పుడు ‘బడ్డీ’కి కథలో కొన్ని పోలికలు ఉన్నా, ప్రధాన కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. అల్లు శిరీష్ తన పరిధిమేర చక్కగా నటించాడు. సోషల్ మీడియా ట్రోల్స్‌ని తీసుకుని యూత్‌ బాగా ఎంజాయ్ చేస్తారు.. అయితే ఇంతకుముందు ‘టెడ్డీ’లో చూసిన చాలా సీన్స్, ‘బడ్డీ’లో కనిపిస్తాయి.

సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. వీఎఫ్‌ఎక్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. ఆలీ కామెడీ ట్రాక్ పెద్దగా వర్కవుట్ కాలేదు. అల్లు శిరీష్‌కి ఈ మూవీ కమ్‌బ్యాక్ అయినా, మాస్ జనాలకు కనెక్ట్ అయితే కమర్షియల్‌గా సక్సెస్ దక్కుతుంది. ఓవరాల్‌గా Buddy జనాలకు పూర్తి కిక్ ఇవ్వలేకపోయిన యావరేజ్ మూవీ..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post