Bharateeyudu 2 Movie Review : ప్రస్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇదే ట్రెండ్ పట్టుకుని, 28 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ ‘భారతీయుడు’ సినిమాని తిరిగి తీసుకొచ్చాడు శంకర్. అప్పుడెప్పుడో 2018లో మొదలైన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదాలు పడుతూ పడుతూ ఎట్టకేలకు 2024లో థియేటర్లలోకి వచ్చింది. మరి ‘భారతీయుడు 2’ ఎలా ఉందంటే..
సేనాపతి, విదేశాలకు వెళ్లిపోయి, అక్కడ సెటిల్ అయిపోతాడు. దీంతో దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా లంచం, లంచం.. దీన్ని ఎలాగైనా అరికట్టాలని సిద్ధార్థ్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. సేనాపతి తిరిగి ఇండియాకి రావాలని సోషల్ మీడియాలో క్యాంపెనింగ్ చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న సేనాపతి, ఇండియాకి తిరిగి వస్తాడు. స్వదేశానికి భారతీయుడి రీఎంట్రీ తర్వాత ఏం జరిగింది? అతను దేశంలోని అవినీతిని ఎలా అంతం చేశాడు? ఇదే ‘భారతీయుడు 2’ కథ..
Kamal Haasan : రోబో 2.0లో విలన్‌గా కమల్ హాసన్.. శంకర్‌కి ఏం చెప్పాడంటే..
ఈ సినిమా ప్రమోషన్స్‌లో తెగ హడావుడి చేశారు శంకర్, కమల్ హాసన్, సిద్ధార్థ.. కంటెంట్ లేనప్పుడే ప్రమోషన్స్ హడావుడి ఎక్కువగా ఉంటుందని నిరూపించిన సినిమా ‘భారతీయుడు 2’. ఈ సినిమాలో నటించిన వివేక్, నేడుముడి వేణు వంటి నటులు, కొన్నేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయారు. వారి చివరి సినిమాగా ‘భారతీయుడు 2’ నిలిచింది. ఇది తప్పించి, ఈ సినిమాలో ఎలాంటి ప్రత్యేకత లేదు..
రకుల్ ప్రీత్, బాబీ సిన్హా, ఎస్ జె సూర్య, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్ర ఖని, మనోబాల.. ఇలా చెప్పుకోవడానికి చాలా మంది నటీనటులు ఉన్నా, నటించడానికి గొప్ప పాత్రలు డిజైన్ చేయలేదు శంకర్.. ‘భారతీయడు’ మూవీలో బాగా వర్కవుట్ అయిన ఎమోషన్స్, ఈ పార్ట్ 2లో ఎక్కడా కనిపించవు..
ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అనిరుథ్ రవిచంద్రన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో జనాలను బయటికి పంపేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. పాటలు అయితే చెప్పాల్సిన పనే లేదు. దీనికంటే ‘భారతీయుడు’ సినిమా పాటలనే మళ్లీ వేసినా బాగుండు అనిపిస్తుంది. ఈ సినిమా పూర్తి చేయలేనని పక్కనపెట్టేశాడు డైరెక్టర్ శంకర్. అయితే ప్రొడ్యూసర్ లీగల్ నోటీసులు ఇవ్వడంతో ఇక చేసేదేం లేక పూర్తి చేశాడు..
Indian 2 Ticket Rates : డబ్బింగ్ సినిమాకి కూడా ఇంత రేటంటే ఎవడు చూస్తాడు!
ఆసక్తి లేకుండా ఏ పని చేసినా అతికినట్టు ఉండదు. అదే ‘భారతీయుడు 2’ సినిమా చూస్తున్నప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొదట్లో కాస్త బాగున్నట్టే అనిపించినా, మెల్లిమెల్లిగా బోర్ కొట్టడం మొదలై, ‘ఒక్కమగాడు’ సినిమాని థియేటర్‌లో రీ-రిలీజ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది..