Bharateeyu 3 Release Date : భారతీయుడు 3 రిలీజ్ డేట్ ఫిక్స్..

Bharateeyu 3 Release Date
Bharateeyu 3 Release Date

Bharateeyu 3 Release Date : ‘భారతీయుడు 2’ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ సినిమా అయిపోయాక వేసిన ‘భారతీయుడు 3’ సినిమా ట్రైలర్, అంచనాలను పెంచింది. ‘భారతీయుడు 2’ సినిమా చేయడానికి కారణం ‘భారతీయుడు 3’ సినిమా అని కమల్ హాసన్ కూడా చెప్పాడు. రెండో పార్టులో కనిపించని హీరోయిన్ కాజల్ అగర్వాల్, మూడో పార్టులో కనిపించనుంది. ట్రైలర్‌లో కూడా కాజల్‌ని చూపించారు.

ఈ సినిమా కోసమే ‘భారతీయుడు 2’ సినిమాని లాగి, ప్రేక్షకులను విసిగించారు. ‘భారతీయుడు 3’ సినిమాని 6 నెలల్లో ప్రేక్షకుల ముందుకు తెస్తామని ప్రకటించాడు డైరెక్టర్ శంకర్. తాజాగా నిర్మాత సుధాకరణ్, ‘భారతీయుడు 3’ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించేశాడు. సంక్రాంతి 2025కి ‘భారతీయుడు 3’ సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు సుధాకరణ్..

Indian 2 Movie : అసలు కథంతా భారతీయుడు 3లోనే!

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ‘భారతీయుడు 3’ సినిమాని థియేటర్లలోకి తీసుకురావడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అయితే ‘భారతీయుడు 2’ సినిమా రిజల్ట్, సీక్వెల్‌పై పడుతుందా? లేదా? అనేది చూడాలి. ‘భారతీయుడు 2’ సినిమాకి భారీ నష్టాలు వస్తే, ‘భారతీయుడు 3’ మార్కెట్, బిజినెస్ విషయంలో లెక్కలు మారతాయి.. ‘భారతీయుడు 3’ మూవీ కంటే ముందే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అయ్యి, హిట్టు అయితే కమల్ మూవీకి ప్లస్ అవుతుంది. శంకర్, చెర్రీకి కూడా డిజాస్టర్ ఇస్తే, ఇక ‘ఇండియన్’ పార్ట్ 3ని ఆ భారతీయుడే కాపాడాలి.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post