Bhaje Vaayu Vegam Review : ‘Rx100’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ, ఆ తర్వాత ‘గుణ 369’, ‘90ML’ వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. హీరోగా ఉన్నప్పుడు ‘’నాని’s గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్‌గా నటించిన కార్తికేయ, తమిళంలో ‘వలిమై’ మూవీలో అజిత్‌తో కలిసి మూవీ చేశాడు. గత ఏడాది ‘బెదురులంక 2012’ మూవీతో వచ్చిన కార్తికేయ, ఈసారి ‘భజే వాయు వేగం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మొదటి అరగంట స్లోగా స్టార్ట్ అయ్యే సినిమా, ఆ తర్వాత పట్టాలెక్కి వాయు వేగంతో దూసుకుపోతుంది. పోలీస్ స్టేషన్‌లో మొదలయ్యే సినిమా, క్రికెటర్‌గా హీరో ఎంట్రీతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. విలన్ గ్యాంగ్‌కి సంబంధించిన ఓ బ్యాగ్ మిస్ అవుతుంది. అది హీరోకి ఎలా చేరింది? అందులో ఏముంది? ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తన తండ్రిని హీరో కాపాడుకోగలిగాడా? ఇదే ‘భజే వాయు వేగం’ మూవీ కథ..
ఇంటర్వెల్ ట్విస్టులు, సెకండాఫ్ ప్రేక్షకులకు థ్రిల్‌ని కలగచేస్తాయి. తాను తీసుకున్న కాన్సెప్ట్‌ని చక్కని స్క్రీన్ ప్లేతో తెరకెక్కించడంలో డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాకి ప్రధానమైన మైనస్ పాటలు. ధావన్ అందించిన మ్యూజిక్ చాలా అవుట్ డేటెడ్‌లా అనిపిస్తుంది. వేగంగా సాగిపోతున్న సినిమాకి పాటలు బ్రేకులు వేసినట్టు అనిపిస్తుంది. ఐశ్వర్యా మీనన్ గ్లామర్ పెద్దగా ప్లస్ కాలేదు. ‘హ్యాపీడేస్’ మూవీలో టైసన్ పాత్రలో నటించిన రాహుల్ హరిదాస్, చాలా రోజుల తర్వాత ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించాడు. అతని కెరీర్‌కి ఈ సినిమా చాలా ప్లస్ కావచ్చు. పాటలు ఎక్కకపోయినా కపిల్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
తనికెళ్ల భరణి, రవి శంకర్, శరత్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఛేజింగ్ సీన్స్, ప్రేక్షకులకు మంచి థ్రిలింగ్ ఫీల్‌ని ఇస్తాయి. ఓవరాల్‌గా ‘భజే వాయు వేగం’ మూవీ, కార్తికేయకి మంచి కమ్‌బ్యాక్ మూవీ అవుతుంది. అయితే ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ పెంచాలి. అప్పుడే పాజిటివ్ టాక్, కలెక్షన్లుగా మారుతుంది. ఈ విషయంలో కేర్ తీసుకుంటే, ‘భజే వాయు వేగం’ ఈ వారంలో మంచి కలెక్షన్లు సాధించగల సత్తా ఉన్న సినిమాయే.