Benefits of Crying : ఏడ్చే వాళ్లలో మనం ఆడవాళ్ళనే ఎక్కువగా, మగవాళ్ళను చాలా తక్కువగా చూస్తుంటాం. సహజంగానే మగవాళ్లకు ఏడుపు రాదా.. లేక వచ్చినా ఏ కారణం చేతనైన వాళ్ళు దాన్ని అణిచిపెట్టేస్తున్నారా!? ఆడవాళ్ళతో పోలిస్తే పురుషులలో ‘ ప్రోలాక్టిన్ హార్మోన్ “(ఎమోషనల్ కన్నీళ్లలో కనిపించే హార్మోన్) తక్కువగా ఉంటుంది. ఇది మనిషి భావోద్వేగాన్ని వ్యక్తపరిచే హార్మోన్.
Handloom Sarees : హ్యాండ్లూమ్ సారీస్ గురించి తెలుసా..!?
దీని వెనుక భారతదేశంలో ఒక స్పష్టమైన సామాజిక కారణం కూడా ఉంది. సమాజంలో ఆడవాళ్లు ఎలా ఉండాలో, ఎలా బతకాలో చెప్పినట్టుగానే.. మగాడాంటే ఇలానే ఉండాలి, మగాడు దేనికైనా వ్యతిరేకంగా నడుచుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు, “ఛీ నువ్వసలు మగాడివే కాదు అన్నీ ఆడ లక్షణాలే, ఆడదానిలా ఆలోచింస్తున్నావు, ఆడంగిలా ఎడుస్తున్నావేంటీ” అని అంటారేమోనని భయపడి, మగవాళ్ళలో సహజంగా ఏర్పడే మానసిక పరివర్తన లక్షణాలు అణిచివేతకు గురవుతాయి.
సహజంగా బయటికి వ్యక్తపర్చచాల్సిన భావోద్వేగాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛను మగాడిగా మారక ముందే కోల్పోతాడు. సమాజంలో స్త్రీల మీద చూపించే వివక్షతో పాటు.. బలహీనత కలిగిన వాళ్ళు అంటే.. ఆడవాళ్లు మాత్రమే అని ముద్రతో మగవాళ్లు అణిచిపెట్టి తెచుకుంటున్న మానసిక సమస్య ఏడ్పుని అణచుకోవడం.
పిల్లల్లో మొబైల్ వాడకం పెరగడానికి కారణాలు..
దీంతో స్ట్రెస్, కోపం, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వడం. దీనివల్లనే మగవాళ్ళు ఎక్కువగా గుండె జబ్బులకు గురవుతున్నారని ఓ పరిశోధనలో తేలింది. మనమే చేతులార తెచ్చుకునే సమస్యలో ఇది టాప్ లో ఉంటుంది.
ఏడవడం వల్ల కలిగే ప్రయోజనాలు :
* ఏడవడం అనేది మనసుకు స్వాంతన చేకూర్చి బాధ నుంచి త్వరగా బయటపడేలా చేస్తుంది.
* ఎక్కువ భావోద్వేగానికి గురై ఏడ్చినప్పుడు కన్నీళ్లు వస్తాయి. తద్వారా శారీరక, మానసిక ఒత్తిడి దూరమై ఎంతో హాయిగా అనిపిస్తుంది.
* అలాగే పరిశోధకులు చెప్పేదేంటంటే.. బాగా ఏడ్చినప్పుడు మన శరీరం నుంచి కన్నీటితో పాటు కొన్ని చెడు రసాయనాలు కూడా బయటికి వెళ్లిపోతాయట.
* బాగా ఏడ్చిన తర్వాత హాయిగా నిద్రపోయిన చిన్నపిల్లలు లేచి నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆదుకోవడం చూసే ఉంటారు. మామూలుగా కన్న ఏడ్చిన తరువాత నిద్రపోయిన పిల్లలే ఎక్కువసేపు నిద్రపోతున్నారని పరిశోధనలో తేలింది.
* మాసికంగా స్ట్రెస్ తగ్గడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూడమే కాకుండా.. కళ్ళలో ఉన్న మలినలు పోవడం వల్ల మెరుగైన చూపు, మెదడు చురుకుగా పనిచేయడం వంటి ఉపయోగాలున్నాయి.
Mohammed Shami Life Story : మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి.. ఇప్పుడు వరల్డ్ కప్‌లో నెం.1 బౌలర్‌గా..
ఇన్ని ఉపయోగాలున్న భావోద్వేగాన్ని ఎవరో, ఏదో అనుకుంటారని నొక్కిపెట్టి మానసిక రోగాలని తెచుకోవడం కన్నా ఏడ్చే సందర్భం వచ్చినప్పుడు ఏడవండి, నవ్వాలనిపించినప్పుడు నవ్వండి. మీకు నచ్చినట్టు బతికేయండి. ఆడ, మగ కన్నా ముందు ఆలోచన కలిగిన మనిషిలాగా బతకండి..