Beauty Tips : టీ ఆకులతో కాంతివంతమైన ముఖం..

Beauty Tips
Beauty Tips

Beauty Tips : ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటారు. మీరు కూడా అనేక ఉత్పత్తులను ఉపయోగించిన తర్వాత కూడా మీ ముఖంపై మచ్చలు మరియు ముడతలతో ఇబ్బంది పడుతుంటే, ఈ హోం రెమెడీని ప్రయత్నించవచ్చు.

టీ తయారు చేసిన తర్వాత మిగిలిన టీ ఆకులను పారేస్తారు, కానీ మీకు తెలుసా, మిగిలిన టీ ఆకులను ఉపయోగించడం ద్వారా మీ ముఖాన్ని అందంగా మార్చుకోచ్చు. అదెలా అంటే..

టీ ఆకులలో అలోవెరా జెల్ కలపాలి. తరువాత దానిని మిక్సీలో రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

మీ మెడ మెరిసిపోవాలి అంటే ఇలా చేయండి..

పగిలిన మడమలకు :
కొంతమందికి వేసవిలో, చలికాలంలో మడమలు పగుళ్లు ఏర్పడతాయి. పగిలిన మడమలు మృతకణాలు, ధూళికి కారణం అవుతాయి. పగిలిన మడమల కోసం టీ ఆకులను ఉపయోగిస్తే, కొద్ది రోజుల్లోనే మీ మడమలు అందంగా కనిపిస్తాయి.

టీ ఆకులను కడిగి అందులో ఓట్స్, కొబ్బరి నూనె కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ను మడమల మీద అప్లై చేసి బాగా స్క్రబ్ చేయాలి. కాసేపయ్యాక మీ పాదాలను గోరువెచ్చని నీటిలో ముంచి, ఆపై స్క్రబ్ చేసి బాగా కడగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే.. మృదువుగా అందంగా మారతాయి.

దాల్చిన చెక్క ఉపయోగాలు..

అలాగే మోకాళ్లు, మోచేతుల నుండి నలుపును తొలగించడానికి కూడా టీ ఆకులను ఉపయోగించవచ్చు. ఈ పద్ధతులన్నీ ఫాలో అయ్యే ముందు పాచ్ టెస్ట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి అలెర్జీ లక్షణాలు కలిగి ఉండవచ్చు. అలాంటి సమయంలో ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

By Mounika

I'm Telugu content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Life Style and Spiritual writings..

Related Post